Viral Video: స్నేహమంటే ఇదేరా.. ! క్యాన్సర్ తో పోరాడుతున్న దోస్త్‌ కోసం.. ఏం చేశారంటే..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్స‌ర్‌. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ బారిన ప‌డితే మ‌ర‌ణం ఒక్క‌టే మార్గం. కానీ ఇప్పుడు..

Viral Video: స్నేహమంటే ఇదేరా.. ! క్యాన్సర్ తో పోరాడుతున్న దోస్త్‌ కోసం.. ఏం చేశారంటే..
Friends
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 13, 2022 | 1:22 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్స‌ర్‌. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ బారిన ప‌డితే మ‌ర‌ణం ఒక్క‌టే మార్గం. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుగుణంగా క్యాన్స‌ర్ నివార‌ణ‌కు చికిత్స‌లు క‌నుగొన‌బ‌డ్డాయి. ఇదంతా ఒక ఎత్తైతే, క్యాన్సర్‌ బాధితులకు ముఖ్యంగా కావాల్సింది.. మానసిక స్థైర్యం..ఎస్ నేను పోరాడగలను. గెలవగలనే అనే నమ్మకం అప్పుడే వ్యక్తిలోని కణాలన్నీ చైతన్యంగా ఉంటాయి. క్యాన్సర్‌తో పోరాడే శక్తి వాటికి వస్తుంది. అందుకే క్యాన్సర్‌ బారిన పడ్డ ఓ మిత్రుడి కోసం అతని స్నేహితులు ఒక గొప్ప పనిచేశారు. వారు చేసిన పనితో ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ వార్తకు సంబంధించిన వీడియో నెటిజన్ల మనసును హత్తుకుంటోంది.

ఈ వీడియోకు ఇప్పటికే 1 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంతకీ విషయం ఏమిటంటే… ఓ బాలుడి క్యాన్సర్ రావడంతో అతనికి చికిత్సను ప్రారంభించారు. అతన్ని ఉత్సాహపరిచేందుకు సహవిద్యార్థులు, స్నేహితులు ఉత్తమ ఆలోచన చేశారు. క్యాన్సర్ కు చికిత్స అంటే గుండు కొట్టిస్తారు. ఆ బాలుడికి కూడా గుండు కొట్టించారు. దాంతో ఆ బాలుడు పాఠశాలకు వస్తే అతనొక్కడే గుండుతో ఉంటానని, దాంతో తనను అంతా వేరైటీగా చూస్తారని భావించిన తోటి స్నేహితులు ఎవరూ చేయని సాహసం చేశారు..అందుకని అతడికి సంఘీభావంగా సహచర విద్యార్థులంతా గుండు చేయించుకున్నారు. క్యాన్సర్‌ బాధిత బాలుడు పాఠశాలకు రాగానే స్నేహితులను చూసి అవాక్కయ్యాడు. ఇది అతనికి నవ్వు తెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది. అలాంటి ఫ్రెండ్స్ ఎవరికి ఉన్నా… ఇక వారిని క్యాన్సర్ కాదు కదా ఏదీ ఏమీ చెయ్యలేదు అంటున్నారు నెటిజన్లు. “నిజమైన ఫ్రెండ్స్” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “గొప్ప మనుషులు” అని మరో యూజర్ కామెంట్‌ చేశారు. ఇంకా అనేకమంది యూజర్లు ఈ స్నేహితులను ప్రశంసిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..