Nepal gang: నగరంలో నేపాలీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఇంట్లో పని మనుషులుగా చేరుతారు.. వీడియో వైరల్

మరో గ్యాంగ్‌ నగరంలో విరుచుకుపడుతోంది. ధనవంతులు, ఒంటరి వృద్ధులే టార్గెట్‌గా వారి ఇంట్లో పని మనుషుల్లా చేరి, అదునుచూసి..

Nepal gang: నగరంలో నేపాలీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఇంట్లో పని మనుషులుగా చేరుతారు.. వీడియో వైరల్
Nepal Gang
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 13, 2022 | 11:57 AM

Nepal gang:  నిన్న మొన్నటి దాకా నగరవాసులు చెడ్డీ గ్యాంగ్‌తో హడలెత్తిపోయారు. ఇప్పుడు మరో గ్యాంగ్‌ నగరంలో విరుచుకుపడుతోంది. ధనవంతులు, ఒంటరి వృద్ధులే టార్గెట్‌గా వారి ఇంట్లో పని మనుషుల్లా చేరి, అదునుచూసి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల నగర వ్యాప్తంగా తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కూకట్ పల్లి వివేకానంద నగర్ లో ఇలాంటి ఘటన జరిగింది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీ గ్యాంగ్.. ఇంట్లో ఉన్న డబ్బు. నగలతో ఊడాయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వివేకానంద నగర్‌లో భారీ చోరీ జరిగింది. ప్లాట్‌ నంబర్‌ 781లో నేపాల్‌ గ్యాంగ్‌ చోరీకి పాల్పడింది. ఇంట్లో ఉన్న రూ.60 లక్షల క్యాష్ తో పాటు బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు పోలీసులు. 7 నెలల క్రితం వివేకానంద నగర్ లోని ఓ ఇంట్లో కుటుంబంతో సహా చక్రి అనే వ్యక్తి పనిలో కుదిరాడు. ఇంట్లో వాళ్ళందరూ ఫంక్షన్ కి వెళ్లడంతో చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. నిన్నరాత్రి ఎవరూ లేని టైంలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశాడు. స్పాట్ లో సీసీ ఫుటేజ్ లో చోరీ విజువల్స్ రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇప్పటికే మూడు బృందాలను పుణె బెంగళూరుకి పంపారు పోలీసులు. ఇలాంటి ముఠాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి