TS Polycet 2022 Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

TS Polycet 2022: తెలంగాణ పాలిసెట్‌ 2022 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలోని...

TS Polycet 2022 Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..
TS Inter Supply Results
Follow us

|

Updated on: Jul 13, 2022 | 12:58 PM

TS Polycet 2022 Results: తెలంగాణ పాలిసెట్‌ 2022 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను జూన్‌ 30న నిర్వహించిన విషయం తెలిసిందే. 3 సంవత్సరాల ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 365 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,13,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,04,432 మంది హాజరు అయ్యారు. అత్యధికంగా 91.62 శాతం హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Results

ఇవి కూడా చదవండి

ఫలితాలు ఇలా తెలుసుకోండి..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

* అనంతరం అటెన్షన్‌ టు క్యాండిడెట్స్‌లో ‘డౌన్‌లోడ్‌ పాలిసెట్‌ 2022 రిజల్ట్స్‌’పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే క్యాండిడెట్‌ లాగిన్‌ పేజ్‌లోకి వెళ్తుంది.

* అక్కడ అభ్యర్థి రోల్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ నొక్కాలి.

* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..