TS Polycet Results: విద్యార్థులకు అలర్ట్‌.. మరికాసేపట్లో పాలిసెట్‌ ఫలితాలు.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

TS Polycet Results: తెలంగాణలో పాలిసెట్‌-2022 పరీక్షా ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని...

TS Polycet Results: విద్యార్థులకు అలర్ట్‌.. మరికాసేపట్లో పాలిసెట్‌ ఫలితాలు.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 13, 2022 | 8:34 AM

TS Polycet Results: తెలంగాణలో పాలిసెట్‌-2022 పరీక్షా ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్ కార్యాల‌యంలో రిజల్ట్స్‌ విడుదల చేయనున్నారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన వారు ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.

జూన్‌ 30న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్‌ పరీక్షను నిర్వహించారు. ఇదిలా ఉంటే బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో కూడా పాలిసెట్‌ ద్వారా సీట్లు పొందవచ్చు.  పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. ఈ విధానాన్ని తొలిసారి అమలు చేస్తున్నారు.

రిజల్ట్స్‌ కోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

* అనంతరం అటెన్షన్‌ టు క్యాండిడెట్స్‌లో ‘డౌన్‌లోడ్‌ పాలిసెట్‌ 2022 రిజల్ట్స్‌’పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే క్యాండిడెట్‌ లాగిన్‌ పేజ్‌లోకి వెళ్తుంది.

* అక్కడ అభ్యర్థి రోల్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ నొక్కాలి.

* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..