AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC Recruitment: చెన్నై ఈఎస్‌ఐసీలో టీచింగ్ పోస్ట్‌లు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

ESIC Recruitment: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్‌స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ చెన్నైలోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో పలు ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో..

ESIC Recruitment: చెన్నై ఈఎస్‌ఐసీలో టీచింగ్ పోస్ట్‌లు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Narender Vaitla
|

Updated on: Jul 12, 2022 | 8:40 PM

Share

ESIC Recruitment: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్‌స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ చెన్నైలోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో పలు ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 81 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు (06), అసోసియేట్‌ ప్రొఫెసర్లు (24), అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (51) ఖాళీలు ఉన్నాయి.

* అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, అనెస్తీషియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు, టీచింగ్‌/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* వాక్‌ ఇంటర్వ్యూను జులై 26,27,28 తేదీల్లో నిర్వహించనున్నారు.

* ఇంటర్వ్యూలను ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, కేకే నగర్‌, చెన్నై అడ్రస్‌లో నిర్వహించనున్నారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 1,30,797 నుంచి రూ. 2,28,942 చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!