Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: వాళ్ల నెత్తిమీద రూపాయి పెడితే.. అర్ధ రూపాయికి కూడా కోనరు.. ఎమ్మెల్సీ కవిత ఫైర్..

నాయకులంతా సైద్ధాంతిక పరమైన రాజకీయాలు చేయాలి.. ఓట్ల రాజకీయాలు కాదంటూ ఎమ్మెల్సీ కవిత సూచించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసే రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.

MLC Kavitha: వాళ్ల నెత్తిమీద రూపాయి పెడితే.. అర్ధ రూపాయికి కూడా కోనరు.. ఎమ్మెల్సీ కవిత ఫైర్..
Mlc Kavitha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2022 | 11:56 AM

MLC Kavitha: ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొంతమంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. ఉద్యమం సమయంలో ఈ మాటలు మాట్లాడే వాళ్లంతా ఎక్కడ ఉన్నారో మనకు తెలుసంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా వాళ్లను కోనరు.. అలాంటి వాళ్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాక్కులు చేవాక్కులు పేలుతున్నారంటూ కవిత మండిపడ్డారు. కేసీఆర్‌తో కలిసి నడిచేవారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయని.. అందరికీ ఆ నమ్మకం ఉందంటూ కవిత పేర్కొన్నారు. నాయకులంతా సైద్ధాంతిక పరమైన రాజకీయాలు చేయాలి.. ఓట్ల రాజకీయాలు కాదంటూ సూచించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసే రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అవన్నీ తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యం అన్నారు. కేసీఆర్ లాంటి జగమొండి నాయకుడు అలాంటి వారిని ఎదుర్కోగలడని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలని.. దేశంలో టీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉండాలి.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాలని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పని చేసే కార్యకర్తలు సమయం కోసం వేచి చూడాలని.. తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు.

కేసీఆర్ ఆశీర్వాదంతో రాజీవ్ సాగర్ కి మంచి గుర్తింపు లభించిందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ గా మెడే రాజీవ్ సాగర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. ఈ పదవి జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని కవిత పేర్కొన్నారు. ఒకప్పుడు రైతు కళ్లలో కన్నిళ్ళుంటే.. ఇప్పుడు అదే రైతు పొలంలో కాళేశ్వరం నీళ్లున్నాయన్నారు. సీఎం కేసీఆర్ మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం మాములు విషయం కాదని.. అదే కేసీఆర్ పనితనమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..