Communal Violence: భర్తలు తస్మాత్ జాగ్రత్త.. తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు.. ఢిల్లీ హైకోర్టు సంచలనం..

భర్తలను, వారి కుటుంబసభ్యులను హింసించేందుకు భార్యలు గృహహింస చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Communal Violence: భర్తలు తస్మాత్ జాగ్రత్త.. తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు.. ఢిల్లీ హైకోర్టు సంచలనం..
Communal Violence
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2022 | 11:26 AM

False Cases By Women Against Husbands: దేశంలో గృహ హింస చట్టం దుర్వినియోగంపై ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గృహిణులకు భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే చాలా మంది మహిళలు ఈ చట్టాన్ని తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. భర్తలను, వారి కుటుంబసభ్యులను హింసించేందుకు భార్యలు గృహహింస చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో..  ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తలు, వారి కుటుంబసభ్యులపై భార్యలు (మహిళలు) పెడుతున్న తప్పుడు కేసులతో ఈ గృహహింస చట్టం దుర్వినియోగమవుతోందని… తప్పుడు కేసుల ఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. దీన్ని ఇలాగే వదిలేస్తే… చట్టం మరింత దుర్వినియోగమయ్యే అవకాశం ఉందంటూ ఢిల్లీ ధర్మాసనం పేర్కొంది. గృహ హింస కేసును విచారిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ జీవించి ఉండగానే ఆమె ఆత్మహత్యకు సంబంధించి కుటుంబసభ్యులు తప్పుడు సమాచారం అందించారని.. ఆ తర్వాత ఆమె అత్తమామలపై కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారని పేర్కొంది.

భర్త కుమార్ కుటుంబం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు లాగేందుకు ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళిక రచించింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి నుంచి అదృశ్యమయ్యేలా ప్లాన్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తప్పుడు సమాచారం అందించింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు.. భర్త, అత్తమామలపై ఓ మహిళ హింస, హత్యా అపహరణ, వరకట్న నిషేధ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత డబ్బులు లాగేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో తాము తప్పు చేయలేదని.. బెయిల్ కోసం బాధితులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబసభ్యులు నాటకాలు ఆడినట్టు కోర్టు గుర్తించింది. ఈ నేరానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల భర్త, ఆయన కుటుంబ సభ్యులు సమాజంలో పరువు కోల్పోతారని, తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మహిళ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ పనిచేసినట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ ఇలాంటి చట్టాల దుర్వియోగంతో నేరాలు సైతం పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. వైవాహిక వివాదాలు, విభేదాల సమయంలో మొత్తం కుటుంబంపై కల్పిత ఆరోపణల ద్వారా కేసులు పెడుతున్నారని పేర్కొంది. చీటింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఆ మహిళకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?