Kadam Project: ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.. ఊర్లు వదిలి వెళ్లాలంటూ..

Kadam Project: కడెం ప్రాజెక్టుకు వరద నీరు తీవ్రంగా పోటెత్తుండటంతో.. ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Kadam Project: ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.. ఊర్లు వదిలి వెళ్లాలంటూ..
Kadam Project
Follow us

|

Updated on: Jul 13, 2022 | 6:58 AM

Kadam Project: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరలతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది. కాగా.. నిర్మల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ ఫ్లో 3 లక్షలుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 18 గేట్లకు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక గేటు మొరాయించడంతో.. దానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి కడెం ప్రాజెక్టుకు వరద నీరు తీవ్రంగా పోటెత్తుండటంతో.. ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టు వద్ద సైరన్‌ మోగించారు. దీంతో ప్రాజెక్ట్‌ సమీపంలోని గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద ఇంకా పెరిగితే.. సమీప గ్రామాలకు ప్రమాదం పొంచిఉందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్ ప్రాంత ప్రజలు తరలి వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే