ఛీ.. యాక్‌ అని ముఖం చిట్లించకండి.. లివర్‌ని కడిగిన ముత్యంలా తళతళలాడించే దివ్యౌషధం!

16 February 2026

TV9 Telugu

TV9 Telugu

చేదుగా ఉంటుందని చాలా మంది కాకర‌కాయ‌ల‌ను దూరం పెడుతుంటారు. నిజానికి వీటి చేదు గుణమే మనకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో కీలకంగా ఉంటాయి

TV9 Telugu

కాక‌ర‌కాయ‌లు తీసుకోవ‌డం అనేక ఆరోగ్య ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం కాకర‌కాయ‌లే కాకుండా కాక‌ర‌కాయ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని మీకు తెలుసా..

TV9 Telugu

అవును.. కాక‌ర‌కాయ‌ల మాదిరిగానే కాకర ఆకులు కూడా అనేక పోష‌కాల‌ను, యాంటీ ఆక్సిడెంట్లను క‌లిగి ఉంటాయి. అందుకే మన పూర్వికుల కాలం నుంచి వైద్యంలో వీటిని అనేక స‌మ‌స్యల‌కు నివార‌ణ‌గా ఉప‌యోగిస్తారు

TV9 Telugu

కాక‌ర ఆకుల్లో విట‌మిన్ ఎ, సి, ఫోలేట్, పొటాషియం, ఐర‌న్ వంటి పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మ‌ధుమేహంతో బాధ‌ప‌డే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

కాకర ఆకుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుప‌రచ‌డంలో, మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించ‌డంలో ఇవి మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కాక‌ర ఆకుల్లో విట‌మిన్ సి స‌మృద్దిగా ఉంటుంది

TV9 Telugu

దీంతో వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్పెక్షన్‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. ఈ ఆకుల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది

TV9 Telugu

తద్వారా బ‌రువు త‌గ్గడంలో కూడా దోహ‌ద‌ప‌డ‌తాయి. కాక‌ర ఆకులు కాలేయ ప‌నితీరును కూడా మెరుగుపరుస్తాయి. శరీరం నుంచి వ్యర్థాల‌ను తొల‌గించ‌డంలో కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

ఆయుర్వేద నిపుణుల ప్రకారం కాకర ఆకుల‌తో నేరుగా జ్యూస్ చేసి అందులో నిమ్మర‌సం క‌లిపి తీసుకోవ‌చ్చు. లేదంటే అర‌టిపండ్లు, ఆపిల్ పండ్లు వంటి వాటితో క‌లిపి స్మూతీగా కూడా చేసి తీసుకోవ‌చ్చు