అందం తెలివితేటలు, మంచి గుణాలతో ముడిపడి ఉంటుందని మీరు ఎప్పుడైనా భావించారా? సైకాలజీ ప్రకారం, దీన్ని హ్యాలో ఎఫెక్ట్ అంటారు. ఈ ప్రభావం వల్ల మనం ఒకరిలోని ఒక్క పాజిటివ్ లక్షణం ఆధారంగా వారిలోని ఇతర గుణాలను ఊహించుకుంటాం. ఇది ఇంటర్వ్యూలలోనూ ప్రభావం చూపుతుంది, తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తుంది.