శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుండి డోన్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 62 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.