కూరలో కొత్తిమీర‌ వస్తే.. ప‌క్కన ప‌డేయ‌కండి!

16 February 2026

TV9 Telugu

TV9 Telugu

వంట చివ‌ర్లో కాస్తింత కొత్తిమీర‌ తురుం చల్లితే ఘుమ ఘుమలు వీధి చివర వరకు ముక్కుపుటాలను ఎగురవేస్తుంది. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల వంటలకు సువాసనే కాదు మంచి రుచి కూడా వస్తుంది

TV9 Telugu

అయితే కొత్తిమీర కేవ‌లం వంట‌లు ఆక‌ర్షణీయంగా క‌నిపించేలా చేయ‌డం మాత్రమే కాదు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది

TV9 Telugu

కొత్తిమీర‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డం, జీర్ణక్రియ సాఫీగా సాగడం వంటి ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయి

TV9 Telugu

కొత్తిమీర ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించే కొన్ని ర‌కాల ఎంజైమ్ లు యాక్టివేట్ అవుతాయి. అందుకే డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది

TV9 Telugu

నీటిలో కొత్తిమీర ఆకుల‌ను వేసి నాన‌బెట్టి ఆ నీటిని తాగుతూ ఉండ‌డం వ‌ల్ల వీరికి మంచి ఫ‌లితం ఉంటుంది. కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

TV9 Telugu

ఈ ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్షణాలు బ్యాక్టీరియ‌ల్ ఇన్పెక్షన్‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చు. కొత్తిమీర ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అంద‌మైన‌, ఆరోగ్యవంతమైన చ‌ర్మాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు

TV9 Telugu

కొత్తిమీర ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ కూడా మెరుగుప‌డుతుంది. దీనిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణక్రియ‌ను ప్రోత్సహించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో ఉబ్బరం, గ్యాస్, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. జీర్ణవ్యవ‌స్థ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది

TV9 Telugu

కొత్తిమీర గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. ఇది శ‌రీరం నుంచి అద‌నంగా ఉండే సోడియంను బ‌య‌ట‌కు పంపిస్తుంది. దీంతో అధిక ర‌క్తపోటు త‌గ్గుతుంది. కొత్తిమీర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి