ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయం సర్వత్రా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు న్యాయవాదులు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లపై కూడా ఏఐ ప్రభావం చూపుతుందని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. రాబోయే 12-18 నెలల్లో ఈ పోస్టులు ఏఐతో భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.