AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu – Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..

ఆ ఐదు గ్రామాల అంశంతో పాటు పలు సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీటితో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్‌ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

Chandrababu - Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..
Ap Cm Chandrababu Tummala Nageswara Rao
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2026 | 9:22 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును.. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమస్యలపై తుమ్మల చర్చించారు. 5 గ్రామపంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్‌ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఏలూరు-కొత్తగూడెం, జగ్గయ్యపేట నేషనల్‌ హైవే పనుల వేగవంతంపై చొరవ చూపాలని మంత్రి తుమ్మల చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు టీటీడీలో తెలంగాణకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పరిధిలోకి వెళ్లిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తుమ్మల పలుసార్లు వెల్లడించారు.

భద్రాచలం అభివృద్ధిలో ఆ ఐదు గ్రామాలు ఎంతో కీలకమని, సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఉష్ణ గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని ఆయన గతంలోనూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలోనే ఉండగా.. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ఏపీ భూభాగంలోకి వెళ్లాయి.

ఈ ఐదు గ్రామాల ఆవాసాలు భౌగోళికంగా రెండు వైపులా తెలంగాణ భూముల మధ్య ఉన్నాయి. మరోవైపు గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండటంతో పరిపాలన పరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయన్న వాదన ఉంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల ఈ అంశంపై మరోసారి ఆయనతో చర్చించారు. దీంతో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గంగా సప్తమి రోజు ఈ పని తప్పక చేయండి.. గోమాత కృపతో ధనవర్షం ఖాయం!
గంగా సప్తమి రోజు ఈ పని తప్పక చేయండి.. గోమాత కృపతో ధనవర్షం ఖాయం!
జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...
జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?
సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!