మహాశివరాత్రి రద్దీలో చోరీ.. కీసరగుట్టలో రెచ్చిపోయిన దొంగలు
మహాశివరాత్రి నాడు కీసరగుట్ట ఆలయంలో భక్తులతో కిక్కిరిసిన సమయంలో ఓ మహిళ మెడలో 5 తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పాత నేరస్థులు లేదా అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. భక్తులు, ముఖ్యంగా నగలు ధరించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
మహాశివరాత్రి పర్వదినం వేళ భక్తులతో కిక్కిరిసిన కీసరగుట్ట క్షేత్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పరమశివుడిని దర్శించుకోవాలనే ఆత్రుతతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులే లక్ష్యంగా కిలాడీ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. శివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు దైవదర్శనంలో నిమగ్నమై ఉంటే.. దొంగలు మాత్రం దోచుకోడానికే వచ్చారు. భక్తుల రద్దీని అదనుగా తీసుకున్న దుండగులు, క్యూలైన్లో దర్శనానికి వెళుతున్న ఓ మహిళ మెడలో నుండి 5 తులాల బంగారు గొలుసును అత్యంత చాకచక్యంగా తెంచుకుని పారిపోయారు. ఒక్కసారిగా తన మెడలోని గొలుసు మాయమవ్వడంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రద్దీగా ఉన్న సమయంలో ఈ చోరీ జరగడంతో, పాత నేరస్థుల పనేనా లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏమైనా ఈ ఘాతుకానికి ఒడిగట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. శివరాత్రి వేళ వేలాదిగా తరలివచ్చే భక్తుల భద్రత కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించినప్పటికీ, పోలీసుల కళ్లు గప్పి మరీ ఈ చోరీ జరగడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. నగలు ధరించిన మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
Bhainsa Municipality: 20 ఏళ్ల తర్వాత భైంసాలో గెలిచిన బీజేపీ
Adilabad Municipality: ఆదిలాబాద్‌లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు
చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

