Azadi Ka Amrit Mahotsav: చరిత్ర చెప్పని వీరుడు..స్నేహితుడి మోసంతో బ్రిటిష్ వారితో గొరిల్లా యుద్ధంలో మోకాలిపై కాల్చి చంపబడ్డ ధీరుడు గురించి మీకు తెలుసా..

దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది. అలాంటి యువ విప్లవకారుడు ఆగ్రాలోని భదావర్ ప్రాంతానికి చెందిన గెందాలాల్ దీక్షిత్ కూడా ఒకరు.

Azadi Ka Amrit Mahotsav: చరిత్ర చెప్పని వీరుడు..స్నేహితుడి మోసంతో బ్రిటిష్ వారితో గొరిల్లా యుద్ధంలో మోకాలిపై కాల్చి చంపబడ్డ ధీరుడు గురించి మీకు తెలుసా..
Azadi Ka Amrit Mahotsav Gen
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2022 | 12:08 PM

Azadi Ka Amrit Mahotsav: మనదేశానికి వ్యాపారం కోసం వచ్చి.. మనలోని అనైక్యతని అవకాశంగా తీసుకుని దేశాన్ని పాలించే రాజులయ్యారు బ్రిటిష్ వారు. భారతీయులను బానిసలుగా భావించి పాలించడం మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారి దాశ్య శృంఖలాలను నుంచి విముక్తి కోసం అనేకమంది వీరులు, వీరమాతలు పోరాడారు. తమ ప్రాణాలను తృణప్రాయముగా త్యజించి చిన్న వయసులోనే మరణించారు. అయితే దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది.

యువ విప్లవకారులు బ్రిటిష్ వారి చీకటి పాలన నుంచి తమ దేశాన్ని విముక్తి చేయడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి వెనుకాడలేదు. అలాంటి యువ విప్లవకారుడు ఆగ్రాలోని భదావర్ ప్రాంతానికి చెందిన గెందాలాల్ దీక్షిత్ కూడా ఒకరు. యువ విప్లవకారుడు. బ్రిటీష్ వారి తూటాలకు ఒక కంటి చూపును కూడా కోల్పోయాడు. బ్రిటిష్ వారితో గొరిల్లా యుద్ధం చేస్తున్న సమయంలో బుల్లెట్ తగిలి మోకాలికి తీవ్ర గాయం అయింది. అయినప్పటికీ అతను తనను తాను రక్షించుకోగలిగాడు.

బాహ్ ప్రాంతంలోని మే గ్రామంలో జన్మించారు పండిట్ గెందాలాల్ దీక్షిత్ నవంబరు 20, 1888న భోలానాథ్ దీక్షిత్ ఇంట్లో జన్మించాడు, చిన్నప్పటి నుండి దీక్షిత్ మంచి చురుకైనవారు..  చదువులో  టాపర్. ఔరయ్యలోని DAV స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. ఇక్కడ యువతకు బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం    విప్లవ పాఠం చెప్పేవారు.

ఇవి కూడా చదవండి

విప్లవ పార్టీ స్థాపన మాతృవేది అనే విప్లవ పార్టీ సంస్థను స్థాపించారు గెందాలాల్ దీక్షిత్.  వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న రాష్ బిహారీ బోస్, కర్తార్ సింగ్ సరభా, శచీంద్రనాథ్ సన్యాల్ వంటి విప్లవకారులను కలుపుకుని ఉత్తర భారతదేశంలో విప్లవ జ్వాలను.. స్వాతంత్యం సాధించాలనే కాంక్షను తీవ్రతరం చేయడానికి కృషి చేశారు.

మోసం చేసిన స్నేహితుడు  బ్రిటీష్ అధికారానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవానికి  గెందాలాల్ దీక్షిత్ పూర్తి సన్నాహాలు చేశారు. అయితే అతని సహచరులలో ఒకరి ద్రోహం కారణంగా.. ఆ ప్రణాళిక విఫలమైంది. అయినప్పటికీ, గెందాలాల్ దీక్షిత్ ధైర్యం కోల్పోలేదు..  బ్రిటిష్ వారితో గెరిల్లా యుద్ధం కొనసాగించాడు.

మెయిన్‌పురిలో దారుణ ఘటన: పండిట్ గెందాలాల్ దీక్షిత్ విప్లవ కాంక్ష.. పోరాటానికి రామ్ ప్రసాద్ బిస్మిల్ కూడా ప్రభావితమయ్యారు. షాజహాన్‌పూర్‌లోని గెందాలాల్ దీక్షిత్‌ సహా ఇతర యువకులతో కలిసి బిస్మిల్ మెయిన్‌పురిలో బ్రిటీష్‌ వారి నుంచి డబ్బులు కొల్లగొట్టారు. శ్వేతజాతీయులతో జరిగిన పోరాట సమయంలో గెందాలాల్ దీక్షిత్ తన ఎడమ కన్నును పోగొట్టుకున్నారు. దీక్షిత్‌ను 1918లో బ్రిటిష్ పోలీసులు ఆయుధాలతో పట్టుకున్నారు. మొదట ఆగ్రా కోటలో ఉంచారు. అయితే మెయిన్‌పురిలోని రామ్ ప్రసాద్ బిస్మిల్ అతని సహచరుల సహాయంతో దీక్షిత్ ను  రక్షించారు.

మోకాలిపై కాల్పులు:  దీక్షిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్‌తో కలిసి చేస్తున్న గెరిల్లా పోరాట సమయంలో బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు. అప్పుడు జరిగిన జరిగిన కాల్పులు మోకాలికి గాయం అయింది. అయినప్పటికీ అతను బ్రిటిష్ వారితో పోరాటాన్ని ఆపలేదు. వారిపై తాను పోరాడుతూనే ఉన్నాడు.

అనారోగ్యంతో తుదిశ్వాస:  క్షయవ్యాధితో బాధపడుతున్న గెందాలాల్ దీక్షిత్ 1919లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఢిల్లీలో తన భార్య ఫూల్మతితో కలిసి ఒక సెల్‌లో నివసించాడు. అతను 21 డిసెంబర్ 1919న మరణించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..