Corona Virus: కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా స్కూల్.. 31 మంది విద్యార్థులు, 10 మంది తల్లిదండ్రులకు పాజిటివ్..

తమిళనాడులోని అండిపట్టిలోని ఒక పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతం కోవిడ్ -19 హాట్‌స్పాట్‌గా మారింది.

Corona Virus: కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా స్కూల్.. 31 మంది విద్యార్థులు, 10 మంది తల్లిదండ్రులకు పాజిటివ్..
Tamilandu Corona
Follow us
Surya Kala

|

Updated on: Jul 09, 2022 | 11:28 AM

Corona Virus: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత రోజుకో రూపం సంతరించుకుని మానవాళిని భయపెడుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా తగ్గినట్లే తగ్గిన కోవిడ్ వ్యాప్తి.. కొత్త వేరియంట్ తో మళ్ళీ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ.. ఫోర్త్ వేవ్ ముంగిట ఉన్నామా అనిపిస్తోంది ఈ అంటువ్యాధి. తాజాగా తమిళనాడులోని అండిపట్టిలోని ఒక పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతం కోవిడ్ -19 హాట్‌స్పాట్‌గా మారింది. తేని జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఈ కేసులు నమోదయ్యాయని  ఆ రాష్ట్ర విద్య సిబ్బంది పేర్కొంది. జిల్లా విద్యా శాఖ ప్రకారం తేని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, అండిపట్టిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విద్యార్థులతో పాటు, 10 మంది తల్లిదండ్రులకు కూడా కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. ఈ పాఠశాలను విద్యాశాఖ తాత్కాలికంగా మూసివేసింది. పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియలో ఆరోగ్య శాఖ బిజీగా ఉంది.

పాఠశాల శానిటైజ్: 

తమిళనాడులో గత 24 గంటల్లో 2,722 తాజాగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి, శుక్రవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 34,96,321కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ -19 కారణంగా మరణాల సంభవించలేదని వైద్య బులెటిన్ తెలిపింది. కొత్త కేసుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 34.93 లక్షలకు చేరుకోగా, మరణాల సంఖ్య 38,028కి చేరుకుంది. గత కొన్ని రోజులుగా చెన్నైలో 939 కొత్త కేసులు నమోదు కాగా..  చెంగల్‌పేట్ 474, తిరువళ్లూరు 191, కోయంబత్తూరు 131, మిగిలినవి ఇతర జిల్లాల్లో నమోదయ్యాయి. అరియలూరులో అత్యల్పంగా ఒక్క కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

గడచిన 24 గంటల్లో మొత్తం 32,614 శాంపిల్స్‌ను పరీక్షించామని.. దీంతో మొత్తం కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య 6.74 కోట్లకు చేరుకుందని హెల్త్ బులెటిన్ లో ఆరోగ్య శాఖ పేర్కొంది.

కోవిడ్-19 టీకా

18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి ముందస్తు జాగ్రత్తగా బూస్టర్ షాట్‌లను ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో వర్చువల్ ఇంటరాక్షన్ సందర్భంగా, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణియన్ ఆరోగ్య శాఖ వద్ద ఉన్న 35.52 లక్షల డోసులను 18-59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ‘ముందుజాగ్రత్త బూస్టర్ డోస్’గా అందించాలని అభ్యర్థించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే