India 2023 GDP Forecast: ఆర్థిక మాంద్యం భయాలు.. దేశ వృద్ధిరేటు అంచనాలకు మరింత కోత

India GDP Forecast: దేశ వృద్ధి రేటు అంచనాను 4.7 శాతానికి నోమురా అనలిస్ట్‌లు పరిమితం చేశారు. అయితే ఇంతకుముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనా 5.4 శాతంగా నమోదు కావచ్చని అంచనావేశారు.

India 2023 GDP Forecast: ఆర్థిక మాంద్యం భయాలు.. దేశ వృద్ధిరేటు అంచనాలకు మరింత కోత
India GDP Forecast
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 13, 2022 | 12:19 PM

India 2023 GDP Forecast: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్‌ జీడీపీ అంచనాను ప్రముఖ గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ నోమురా(Nomura) బుధవారం తగ్గించింది. దేశ వృద్ధి రేటు అంచనాను 4.7 శాతానికి పరిమితం చేసింది. అయితే ఇంతకుముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనా 5.4 శాతంగా నమోదు కావచ్చని అంచనావేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం వృద్ధి రేటు కోతకు కారణంగా పేర్కొన్నది.

అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వృద్ధి రేటు మళ్లీ గాడిలో పడే అవకాశముందని  నోమురాకు చెందిన అనలిస్టులు అంచనావేశారు. జీడీపీ వృద్ధి 7.0 శాతంగా.. 2024-25లో 5.5 శాతంగా ఉండే అవకాశముందని తెలిపారు.

కరోనా పాండమిక్ తర్వాత దేశ వృద్ధిరేటు గాడిలో పడే సూచనలు కనిపించాయి. అయితే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, పెరిగిన చమురు ధరలకు తోడు ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నెలకొనవచ్చన్న భయాలు నెలకొంటున్నాయి. వృద్ధిరేటును పెంచేందుకు ఆర్బీఐ మే మాసంలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు, జూన్ మాసంలో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. అయినా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో రూపాయి మారకం విలువ అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అటు ఆసియాలోని ఇతర కరెన్సీ విలువలు కూడా క్షీణించాయి. విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఒత్తిళ్లకు గురవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత పరిస్థితుల్లో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కీలక వడ్డీ రేట్లను పెంచితే రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశముంది. ఈ కారణాలతో దేశ వృద్ధిరేటు మరింత తగ్గే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు కూడా అంచనావేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..

మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!