AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Cars: ప్రపంచంలోనే సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ కార్లు ఇవే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

ప్రస్తుతం, చాలా ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది ఎలక్ట్రిక్ కార్ వినియోగదారులకు అతిపెద్ద సవాలుగా మారింది.

Electric Cars: ప్రపంచంలోనే సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ కార్లు ఇవే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
Electric Cars
Venkata Chari
|

Updated on: Jul 13, 2022 | 11:02 AM

Share

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ సెగ్మెంట్ మార్కెట్ పరిమాణం నిరంతరం పెరుగుతోంది. ఈ అవకాశాన్ని చూసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ కార్ల కంపెనీలు.. ఎలక్ట్రిక్ వేరియంట్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అలాగే వాటి ఉత్పత్తి మునుపటితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం, చాలా ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది ఎలక్ట్రిక్ కార్ వినియోగదారులకు అతిపెద్ద సవాలుగా మారింది. అయితే, సాంకేతికతలను మెరుగుపరచడం ద్వారా ఈ సమస్యను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే కొన్ని ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే 5 ఎలక్ట్రిక్ కార్లను చూద్దాం..

  1. పోర్స్చే టైకాన్ ప్లస్.. జర్మనీకి చెందిన స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్స్చే నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు పోర్షే టైకాన్ ప్లస్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే కారు ఇదే. ఈ కారులో అత్యుత్తమ, ఆధునిక ఫీచర్లతో విడుదలైంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో, ఈ కారు ప్రపంచవ్యాప్తంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ కారు కేవలం ఒక గంట డీసీ ఛార్జింగ్‌లో వేయి కిలోమీటర్ల కంటే ఎక్కువ పరుగులు చేయగలదు.
  2. కియా ఈవీ6 లాంగ్ రేంజ్ 2డబ్ల్యూడీ.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే రెండవ ఎలక్ట్రిక్ కారును కియా తయారు చేసింది. ఈ కారు ఒక గంట డీసీ ఛార్జింగ్‌లో 1,046 కిమీ, ఏసీ ఛార్జింగ్‌లో 51 కిమీ వరకు వెళ్లగలదు.
  3. ఇవి కూడా చదవండి
  4. మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 4 మాటిక్.. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ విడుదల చేసిన ఈ కారు ఛార్జింగ్ పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ కారు ఒక గంట ఏసీ ఛార్జ్‌లో 53 కి.మీ, డీసీ ఛార్జింగ్‌లో 788 కి.మీ వెళ్లగలదు.
  5. టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ డ్యూయల్ మోటార్.. ప్రసిద్ధ కంపెనీ టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో రెండవ స్థానంలో ఉంది. ఈ కారు ఏసీ ఛార్జింగ్‌తో ఒక గంట పెడితే 54 కి.మీలు పరుగెత్తగలదు. డీసీ ఛార్జింగ్‌తో ఒక గంట పెడితే దాదాపు 595 కి.మీ. వెళ్లగలదు
  6. హ్యుందాయ్ ఐయోనిక్ లాంగ్ రేంజ్ 2WD.. హ్యుందాయ్ విడుదల చేసిన ఈ కారు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ కారుగా పేరుగాంచింది. ఈ కారు ఒక గంట AC ఛార్జింగ్‌తో 59 కి.మీలు వెళ్లగలదు. అదే DC ఛార్జింగ్‌తో 1 గంట ఛార్జింగ్‌పై 933 కి.మీల రేంజ్‌ను పొందగలదు.