Team India: టీ20ల్లో శతక్కొట్టిన ఐదుగురు భారతీయులు.. తొలి సెంచరీ ఎవరు చేశారో తెలుసా?

కొంతమంది బ్యాటర్లు మాత్రం తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో పొట్టి ఫార్మాట్‌లోనూ సెంచరీలు అవలీలగా చేసేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ టీ20లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ శతక్కొట్టాడు.

Team India: టీ20ల్లో శతక్కొట్టిన ఐదుగురు భారతీయులు.. తొలి సెంచరీ ఎవరు చేశారో తెలుసా?
కొంతమంది బ్యాటర్లు మాత్రం తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో పొట్టి ఫార్మాట్‌లోనూ సెంచరీలు అవలీలగా చేసేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ టీ20లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ శతక్కొట్టాడు.
Follow us
Venkata Chari

|

Updated on: Jul 11, 2022 | 9:36 PM

టీ20ల్లో సెంచరీ కొట్టాలంటే చాలా దూకుడుగా ఆడాలి. వన్డేలు, టెస్టుల్లో అయితే ఎక్కువ సమయం ఉంటుంది. కానీ, పొట్టి పార్మాట్‌లో అలాకాదు. కేవలం 20 ఓవర్లలో ఓ ఇన్నింగ్స్ అయిపోతుంది. ఇందులో మొత్తం 120 బంతులే ఉంటాయి. కానీ, కొంతమంది బ్యాటర్లు మాత్రం తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో పొట్టి ఫార్మాట్‌లోనూ సెంచరీలు అవలీలగా చేసేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ టీ20లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ శతక్కొట్టాడు. అసలు భారత్ తరపున టీ20ల్లో ఎంతమంది సెంచరీలు దాటాలో ఓసారి చూద్దాం..

  1. సురేశ్‌ రైనా.. భారత్ తరపున పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా మాజీ క్రికెటర్ సురేష్ రైనా నిలిచాడు. 2010 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై సురేష్ రైనా 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.
  2. రోహిత్ శర్మ ఖాతాలో నాలుగు సెంచరీలు.. సురేష్ రైనా తర్వాత ఈ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ చేసిన లిస్టులో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 2015లో దక్షిణాఫ్రికాపై శతక్కొట్టాడు. హిట్‌మ్యాన్‌ కేవలం 66 బంతుల్లో 106 చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 160.60 స్ట్రైక్‌రేట్‌‌తో పరుగులు రాబట్టాడు. అలాగే 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా సారథి రోహత్ కేవలం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 274.41 స్ట్రైక్‌రేట్‌‌తో పరుగులు రాబట్టాడు. ఇక 2018లో బ్రిస్టల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (100 నాటౌట్‌; 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులు) మూడో సెంచరీ చేసిన రోహిత్.. అదే సంవత్సరం లఖ్‌నవూ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (111 నాటౌట్‌; 61 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు) నాలుగో సెంచరీ చేశాడు.
  3. కేఎల్ రాహుల్‌ ఖాతాలో రెండు.. ఇక భారత్ తరపున పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. 2016లో అమెరికాలో వెస్టిండీస్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ 51 బంతుల్లో 110 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సులు బాదేశాడు. 215.68 స్ట్రైక్‌రేట్‌తో ఈ మ్యాచ్‌లో రాహుల్ బ్యాటింగ్ చేశాడు. 2018లో మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచిన రాహుల్ (10×4, 5×6) రెండో శతకం కొట్టేశాడు.
  4. దీపక్‌ హుడా.. టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్‌ దీపక్‌ హుడా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 57 బంతుల్లో 104 పరుగులు చేసి, తన తొలి సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సూర్యకుమార్‌.. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యా్చ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. ఇందులో కేవలం 55 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. యాదవ్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి.