AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వర్షకాలంలో మొక్కజొన్నలు తెగ లాగించేస్తున్నారా.. ఇలా తింటే మాత్రం హానికరంగా మారే ఛాన్స్..

ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో మొక్కజొన్న తినడానికి ఇష్టపడతారు. ఉప్పు, కారం, నిమ్మరసం కలిపితే దీని రుచి పెరుగుతుంది. కానీ..

Health Tips: వర్షకాలంలో మొక్కజొన్నలు తెగ లాగించేస్తున్నారా.. ఇలా తింటే మాత్రం హానికరంగా మారే ఛాన్స్..
Corn
Venkata Chari
|

Updated on: Jul 10, 2022 | 8:27 PM

Share

మొక్కజొన్న వాసన వర్షాకాలంలో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మొక్కజొన్న ఆరోగ్యకరమైనది. రుచికరమైనది. అయితే, సరిగ్గా తినకపోతే మాత్రం హానికరంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అసలు మొక్కజొన్నను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నను పచ్చిగా తిన్నా లేదా సరిగ్గా నమలకపోయినా ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా పిల్లలు మొక్కజొన్న తినేటప్పుడు సరిగ్గా నమలరు. దీనివల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, పిల్లలకు పొట్టలో సమస్యలు మొదలవుతాయి.

తినేప్పుడు జాగ్రత్త..

ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో మొక్కజొన్న తినడానికి ఇష్టపడతారు. ఉప్పు, కారం, నిమ్మరసం కలిపితే దీని రుచి పెరుగుతుంది. కానీ, సరైన ఎంపిక, సరైన ఆహారం తెలియకపోతే, రుచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మొక్కజొన్నను మెత్తగా లేదా గట్టిపడకుండా చూసుకోండి. లేకుంటే జీర్ణం కావడం కష్టమై కడుపునొప్పుల్లాంటి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మొక్కజొన్న ఉడకబెట్టడానికి సరైన పద్ధతి..

మొక్కజొన్న సరిగ్గా ఉడకకపోతే, పచ్చిగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, డయేరియా వంటివి వస్తాయి. మొక్కజొన్నను కుక్కర్‌లో 3 నుంచి 4 విజిల్స్ వరకు ఉడికించాలి. అప్పుడు తినడం వల్ల జీర్ణం కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొక్కజొన్నను పచ్చిగా లేదా సరిగ్గా ఉడకబెట్టకుండా తినవద్దు. దీనివల్ల డయేరియా వస్తుంది. మీరు బరువు తగ్గాలనుకున్నా, మొక్కజొన్న ఎక్కువగా తీసుకోకండి. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు.

రుచిలో అద్భుతం..

మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పాంతోతేనిక్ యాసిడ్, ఫాస్పరస్, నియాసిన్, ఫైబర్, మాంగనీస్, విటమిన్ B6 లాంటి వాటికి మంచి మూలంగా మొక్కజొన్న నిలుస్తుంది. మొక్కజొన్న పిండిలో ఫైబర్, గ్లూటెన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మధుమేహం, రక్తపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నివారిస్తుంది. దీన్ని వేయించి, కాల్చి, ఉడకబెట్టి, అన్ని రకాలుగా తినొచ్చు. మొక్కజొన్న అతిపెద్ద లక్షణం ఏమిటంటే దాని పోషక విలువ వంట తర్వాత పెరుగుతుంది. వండిన మొక్కజొన్నలో కెరోటినాయిడ్స్, ఫోలిక్ యాసిడ్ వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. అలాగే పాప్‌కార్న్‌లు, జున్ను, బటర్ సాల్ట్, టాంగీ టొమాటో, కారామెల్ వంటి రుచికరమైన పదార్థాల్లో వాడుతున్నారు.