క్రికెట్ చరిత్రలో 4 అద్భుత రికార్డులు.. ఇప్పటి వరకు బ్రేక్ చేయని ప్లేయర్లు.. అవేంటో తెలుసా?

నేటికీ క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు ఉన్నాయి. వాటిని ఎవరూ బద్దలు కొట్టలేకపోతున్నారు. అభిమానులకు ఈ రికార్డుల గురించి తెలియదు.. అలాగే చాలా మంది ఆటగాళ్లకు అసలు ఇలాంటివి రికార్డులు ఉన్నాయని గుర్తుండదు.

క్రికెట్ చరిత్రలో 4 అద్భుత రికార్డులు.. ఇప్పటి వరకు బ్రేక్ చేయని ప్లేయర్లు.. అవేంటో తెలుసా?
Cricket Records
Follow us
Venkata Chari

|

Updated on: Jul 09, 2022 | 6:20 PM

రోజురోజుకు క్రికెట్ ఆటపై క్రేజ్ మరింత పెరుగుతోంది. మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు ఏర్పడుతూనే ఉంది. కొన్ని రికార్డులు సృష్టించిన వెంటనే బద్దలవుతున్నాయి. కానీ, నేటికీ క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు ఉన్నాయి. వాటిని ఎవరూ బద్దలు కొట్టలేకపోతున్నారు. అభిమానులకు ఈ రికార్డుల గురించి తెలియదు.. అలాగే చాలా మంది ఆటగాళ్లకు అసలు ఇలాంటివి రికార్డులు ఉన్నాయని గుర్తుండదు. దశాబ్దాలుగా ఈ రికార్డులను ఎవరూ చేరుకోలేకపోయారు.

ODI మ్యాచ్‌లో అత్యంత పొదుపు బౌలింగ్..

వన్డే క్రికెట్‌లో అత్యంత పొదుపుగా ఉండే స్పెల్‌ను ఎవరు సంధించారో తెలుసా? ఫిల్ సిమన్స్ 1992లో ఎకనామిక్ బౌలింగ్‌కు బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. పాకిస్థాన్‌పై 10 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇందులో 8 మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. అతని ఎకానమీ రేటు 0.30. సిమన్స్ 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

అత్యంత పురాతన టెస్ట్ క్రికెటర్..

ఏ ఆటగాడి కెరీర్ అయినా 40 తర్వాత పూర్తిగా ముగిసిపోయిందని అనుకుంటే, 41 లేదా 42 సంవత్సరాల వయస్సు గల వారు అంతర్జాతీయ క్రికెట్‌లో కనబడలేదు. కానీ, 52 సంవత్సరాల 165 రోజుల వయస్సులో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన విల్ఫ్రెడ్ రోడ్స్ అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ విల్ఫ్రెడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4204 వికెట్లు పడగొట్టాడు.

వన్డే మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు..

వన్డే క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చమిందా వాస్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన ఏకైక బౌలర్. అతను డిసెంబర్ 2001లో జింబాబ్వేపై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ కూడా తీశాడు.

అతి తక్కువ సమయం సాగిన టెస్ట్ మ్యాచ్..

ఒక టెస్ట్ మ్యాచ్ గరిష్టంగా 5 రోజులు ఆడతారు. కొన్నిసార్లు టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లో కూడా అయిపోతుంది. 3 రోజుల్లో ముగిసే మ్యాచ్‌లో ఏదైనా ఒక జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సిందే. 1932లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత పొట్టి మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఒక్కరోజు కూడా సాగలేదు. కేవలం 5 గంటల 53 నిమిషాల్లోనే మ్యాచ్‌ సద్దుమణిగింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 36, రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసి ఇన్నింగ్స్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.