Multibagger Stocks: లక్ష పెట్టుబడి.. ఏడాదిలో రూ.8 లక్షలు.. 700 శాతం రిటర్న్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్..
ప్యాకేజింగ్ రంగంలో ఈ కంపెనీ స్టాక్ ఏడాదిలో దాదాపు 700 శాతం పెరిగింది. అంటే ఏడాదిలో దాదాపు 8 రెట్లు పెట్టుబడి పెరిగింది. కంపెనీ ప్యాకేజింగ్ రంగంలో అగ్రగామి సంస్థగా మారింది.
గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్(Stock Market) హెచ్చు తగ్గులను చవిచూస్తోంది. అయితే, కొన్ని బలమైన కంపెనీలు మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. ఈ అనిశ్చితి వాతావరణంలో కూడా స్థిరమైన వృద్ధిని చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లో లాభాలను నమోదు చేసుకున్న కొన్ని స్టాక్(Stocks)లలో, పెట్టుబడిదారుల సంఖ్య కేవలం ఒక సంవత్సరంలోనే అనేక రెట్లు పెరిగింది. ఇటువంటి మల్టీబ్యాగర్(Multibagger)లో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయాలు.. కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు 8 లక్షల రూపాయలకు చేరుకుంది. ఆ కంపెనీ ఏదని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఆ కంపెనీ పేరు GKP ప్రింటింగ్ & ప్యాకేజింగ్ స్టాక్. కంపెనీ ప్యాకేజింగ్ రంగంలో స్మాల్‌క్యాప్ కంపెనీగా పేరుగాంచింది. ఈ స్టాక్ ప్రస్తుతం BSEలో లిస్టయింది. ఇది త్వరలో NSEలో ట్రేడింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఒక సంవత్సరంలో దాదాపు 700 శాతం పెరిగిన స్టాక్..
ప్యాకేజింగ్ రంగంలో ఈ కంపెనీ స్టాక్ ఏడాదిలో దాదాపు 700 శాతం పెరిగింది. జులై 9న ఈ షేరు రూ.26.45 వద్ద ముగిసింది. శుక్రవారం ఈ షేరు 207.4 స్థాయి వద్ద ముగిసింది. అంటే, గత ఏడాది కాలంలో ఈ స్టాక్‌లో 684 శాతం జంప్ నమోదైంది. అంటే గతేడాది లక్ష రూపాయలను స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన పెట్టుబడిదారుడి పెట్టుబడి విలువ రూ.7.8 లక్షలకు పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఈ స్టాక్ గరిష్టంగా 727 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ స్మాల్‌క్యాప్ కంపెనీ కాగా, శుక్రవారం ముగింపు ధర నాటికి కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.304 కోట్లు మాత్రమే. అయితే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.145 కోట్లుగా నిలిచింది.
కంపెనీ ప్రత్యేకత ఏమిటి..
GKP ప్రింటింగ్ & ప్యాకేజింగ్ దాని రంగంలో ఒక పెద్ద కంపెనీ. GKP తన ఉత్పత్తులను వస్త్ర ఎగుమతి, ఉక్కు పాత్రలు, బొమ్మలు, లిక్కర్లు, ఫార్మా రంగం, ప్రింటర్లు, ఇంజనీరింగ్, FMCG రంగాలతో సహా వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. కంపెనీ దేశంలోనే అతిపెద్ద కార్డ్‌బోర్డ్ పెట్టెలు, డిస్‌ప్లే బాక్స్‌లు, లేబుల్‌లు, స్టిక్కర్‌లు, ట్యాగ్‌ల తయారు చేస్తూ, ఎగుమతి చేస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికపై పని చేస్తోంది. ఇటీవల కంపెనీ వాపి గుజరాత్‌లో 43,234 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది. కంపెనీ TCS, Spectra International, Naaptaul, SM Foods, Rediff.comతో అనుబంధం కలిగి ఉంది. జులై 6న, ఎన్‌ఎస్‌ఇలో లిస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహాన కోసమే. ఇది పెట్టుబడి కోసం అందించే సలహా కాదు. మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే లాభనష్టాలతో కూడుకున్నది, అందుకే నిపుణుల సలహాతోపాటు, నిశితంగా పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలి.