Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Price: మిల్లర్లకు ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర ధరలకు రెక్కలొస్తాయా?

కేంద్రం మునుపటి ఆ దేశాల మేరకు 8 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు మిల్లర్లకు ఇచ్చిన గడువు జులై 5వ తేదీతోనే ముగిసింది.

Sugar Price: మిల్లర్లకు ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర ధరలకు రెక్కలొస్తాయా?
Sugar
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 08, 2022 | 3:35 PM

Sugar Export: దేశంలోని చక్కెర మిల్లర్లకు ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం(Indian Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 8 లక్షల టన్నుల చక్కెర ఎగుమతలు కోసం మిల్లర్లకు గతంలో ఇచ్చిన గడువును మరో రెండు వారాల పొడిగించింది. జులై 20వ తేదీ వరకు ఎగుమతులకు అనుమతివ్వనున్నట్లు శుక్రవారం కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వర్షాల కారణంగా చక్కెర ఉత్పత్తిదారులు ఫ్యాక్టరీల నుండి ఓడరేవులకు స్టాక్‌లను తరలించడం కష్టతరంగా మారింది. దీంతో ఎగుమతి గడువును పొడగిస్తూ మిల్లర్లకు కేంద్రం ఊటర కలిగింది. కేంద్రం మునుపటి ఆ దేశాల మేరకు 8 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు మిల్లర్లకు ఇచ్చిన గడువు జులై 5వ తేదీతోనే ముగిసింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలకు రెక్కలొచ్చే అవకాశముందని కొందరు మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే షుగర్ మిల్లర్లు మాత్రం ఎగుమతుల కారణంగా దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రస్తుత అవసరాలకు తగిన నిల్వలు మన దగ్గర ఉన్నాయని.. వచ్చే సీజన్‌లో బంపర్ పంటను ఆశించవచ్చని వారు చెబుతున్నారు.

గ్రేస్ పీరియడ్‌ను స్వాగతించిన చక్కెర మిల్లర్లు

ఇవి కూడా చదవండి

చక్కెర ఎగుమతులకు వచ్చిన గడువును పొడగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) హర్షం వ్యక్తంచేసింది. కేంద్ర నిర్ణయం పట్ల ఇస్మా ప్రెసిడెంట్ ఆదిత్య జున్‌జున్‌వాలా ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. వర్షాల కారణంగా చక్కెర ఎగుమతులకు అంతరాయం కలిగిందన్నారు. కొత్త గడువు కంటే ముందే చక్కెర నిల్వలను ఎగుమతి చేసేందుకు మిల్లర్లు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఆరేళ్లలో తొలిసారిగా మేలో ఎగుమతులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం.. ఆ తర్వాత జూలై 5 వరకు మాత్రమే ఎగుమతులకు అనుమతివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెల ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ మార్కెట్‌లో మన మిల్లర్లు రికార్డు స్థాయిలో చక్కెర విక్రయించారు. భారీ ఎగుమతుల నేపథ్యంలో దేశంలో చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. దీంతో దేశీయ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఈ సీజన్ ఎగుమతులపై పరిమితులు విధించింది. అయితే మునుపటి పరిమితికి అదనంగా మరో 1 మిల్లియన్ టన్నుల ముడి చక్కెర ఎగుమతికి కేంద్రం అవకాశం కల్పించాలని మిల్లర్లు కోరుతున్నారు. అదనపు ఎగుమతులు దేశీయ కొరతకు దారితీసే అవకాశం లేదని.. వచ్చే సీజన్‌లో బంపర్ పంటను ఆశించవచ్చని ఇస్మా ప్రెసిడెంట్ ఆదిత్య జున్‌జున్‌వాలా తెలిపారు.

బ్రెజిల్‌ని అధిగమించిన భారత్..

ISMA అంచనాల ప్రకారం 36 మిలియన్ టన్నుల ఉత్పత్తితో సెప్టెంబర్ 30 వరకు మార్కెటింగ్ సంవత్సరంలో బ్రెజిల్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా అవతరించనుంది. ప్రస్తుతం చక్కెర ఎగుమతులు లాభదాయకంగా ఉన్నందున మిల్లర్లు అటు వైపు మొగ్గుచూపుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో చక్కెరకున్న భారీ ధరలు, బలహీనమైన రూపాయి విలువను పరిణలోకి తీసుకుని కేంద్రం వెంటనే వచ్చే సీజన్ పాలసీని ప్రకటించాలని షుగర్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులు కోరుతున్నారు. తద్వారా చక్కెర మిల్లర్లు, వ్యాపారులు ఇప్పుడు తదుపరి సీజన్ కోసం ఇతర దేశాలకు చక్కెర ఎగుమతుల కోసం ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా కొన్ని నెలల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు తగ్గినప్పటికీ.. దాని ప్రభావం ఎగుమతులపై ఉండదన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..