Cable-Stayed Rail Bridge: కశ్మీర్‌లో ఇంజనీరింగ్ అద్భుతం.. దేశంలోనే తొలి కేబుల్-స్టేడ్ రైలు వంతెన..
జమ్మూశ్మీర్‌లో భవిష్యత్తు సిద్ధంగా ఉందంటూ.. అంజి ఖాడ్ వంతెన తాజా ఫోటోలను అశ్వని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంజినీరింగ్ అద్భుతం.. నిర్మాణంలో ఉన్న అంజి ఖాడ్ వంతెన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కత్రా, రియాసీలను కలుపుతుంది.
India’s 1st Cable-Stayed Rail Bridge: దేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన ప్రారంభానికి సిద్ధమమవుతోంది. జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న మొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. జమ్మూశ్మీర్‌లో భవిష్యత్తు సిద్ధంగా ఉందంటూ.. అంజి ఖాడ్ వంతెన తాజా ఫోటోలను అశ్వని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంజినీరింగ్ అద్భుతం.. నిర్మాణంలో ఉన్న అంజి ఖాడ్ వంతెన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కత్రా, రియాసీలను కలుపుతుంది. అంజి నదికి ఎగువన ఉన్న రియాసి జిల్లాలో ఉన్న ఈ వంతెన సవాలుతో కూడిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌లో ఒక భాగం. ఇక్కడ భూభాగం హిమాలయాల గుండా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ కింద అంజి ఖాడ్ వంతెనపై భారతీయ రైల్వే 50% పైగా పనులను పూర్తి చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో బ్రిడ్జి పురోగతి ఫొటోలను పంచుకుంది. భౌగోళిక పరిస్థితులను అధిగమించి, నిర్మాణం పూర్తి వేగంతో జరుగుతోందని మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో పేర్కొంది.
473.25 మీటర్ల పొడవున వంతెనను నదీ మట్టానికి 331 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. భారీ తుఫానులను ఎదుర్కొనేలా ఈ వంతెనను 96 కేబుల్స్ సపొర్టుతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం అత్యంత సంక్లిష్టమైన భూగర్భంలో ఉన్న కారణంగా చీనాబ్ నదికి అడ్డంగా ఈ వంతెనను నిర్మించడం అసాధ్యంగా ఉన్నా.. మన ఇంజినీరింగ్ నిపుణులు సుసాధ్యం చేసి చూపారు. అంజి ఖాడ్ వంతెన వద్ద నిలువు వాలుపై ఒకే పైలాన్‌ను మాత్రమే నిర్మించనున్నారు.
A future-ready ??
Nation’s first cable-stayed rail bridge, Anji Khad bridge connecting #Kashmir. pic.twitter.com/pVdA2avIuY
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 7, 2022
వంతెన నిర్మాణంలో పంప్ కాంక్రీటింగ్ సిస్టమ్ అమరికతో సహా ప్రత్యేకమైన, అధునాతన సాంకేతికతలతో పరికరాలు ఉపయోగించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టును కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) అభివృద్ధి చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..