రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ దంపతులు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు ముంబయిలోని తమ నివాసంలో ఆత్మీయ స్వాగతం పలికారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. హిల్లరీ రాక సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.