ఒంటి కన్ను చేప కూర.. ఇలా వండి తింటే లైఫ్ లాంగ్ తింటూనే ఉంటారు
Prasanna Yadla
21 February 2026
Pic credit - Pixabay
చేపల్లో అనేక రకాలు ఉంటాయి. అయితే, వాటిలో కొన్ని రుచికరంగా ఉంటాయి. మరి కొన్ని తినాలన్న కూడా దొరకవు.
చేపలు
మనం ఇప్పటి వరకు కొర్రమీను చేపను తిన్నాము. అయితే , ఇప్పుడు చెప్పబోయే చేప అయితే చాలా రుచికరంగా ఉంటుంది.
చేపలు
ఫ్లాండర్ అనే పిలవబడే చేపలు మరింత రుచిని ఇస్తాయి. ఇవి మాల్స్ లోనే దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే ఇవి ఒక కన్ను మాత్రమే చూడగలవు.
ఫ్లాండర్ చేపలు
ఈ చేపలు కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
ఫ్లాండర్ చేపల కర్రీ
అర కిలో ఫ్లాండర్ చేపల ముక్కలు, ఒక చిన్న కప్పు చింతపండు రసం, ఒక చిన్న ఉల్లిపాయ, 2 టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు, కరివేపాకును తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా చేప ముక్కలను తీసుకుని ఉప్పులో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇంకా వాసన వస్తే నిమ్మరసంతో కూడా ఇంకోసారి శుభ్ర పరచండి.
స్టెప్ - 1
ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమోటాలు ముక్కలు వేసి మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
కారం, రుచికి తగినంత ఉప్పు వేయాలి వేయాలి.
స్టెప్ - 2
ఒక కప్పు చింతపండు రసం, మసాలాలు వేసి బాగా ఉడకనివ్వండి. స్టవ్ మీదే 15 నిమిషాల పాటు ఉంచండి. చివర్లో కొత్తిమీర వేసి దించేయండి.