AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Fry Recipe: ఆదివారం స్పెషల్.. ఈజీగా టేస్టీగా చేపల వేపుడు తయారీ విధానం మీ కోసం..

చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల వేపుడు కూడా ఒక‌టి. ఈ రోజు ఈజీగా టేస్టీగా చేప‌ల వేపుడుతయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం.. 

Fish Fry Recipe: ఆదివారం స్పెషల్.. ఈజీగా టేస్టీగా చేపల వేపుడు తయారీ విధానం మీ కోసం..
Fish Fry Recipe
Surya Kala
|

Updated on: Jul 10, 2022 | 8:30 PM

Share

Fish Fry Recipe: సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా అనేక రకాలున్నాయి. కానీ వీటన్నిటిలోనూ చేపలు వెరీ వెరీ స్పెషల్. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ చేపల్లో ఉన్నాయి. వీటిని ఆహారంగా తినడం వలన శరీరానికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. చేపలతో చేపల పులుసు, కూర, వేపుడు వంటి రకరకాల ఆహారపదార్దాలను తయారు చేస్తారు. చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల వేపుడు కూడా ఒక‌టి. ఈ రోజు ఈజీగా టేస్టీగా చేప‌ల వేపుడుతయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:  వేపుడుకి కావల్సిన చేప ముక్కలు: 6 కోడి గుడ్డు : ఒక గరం మసాలా పొడి: అర టీ స్పూన్ జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్: కార్న్ ప్లోర్ : టీ స్పూన్ కారం : టీ స్పున్ పసుపు: పావు టీ స్పూన్, నిమ్మర‌సం : 2 టీ స్పూన్స్, ఉప్పు : రుచికి సరిపడా త‌రిగిన కొత్తిమీర త‌రిగిన క‌రివేపాకు నూనె: వేయించడానికి సరిపడా

త‌యారీ విధానం: చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా క‌డిగి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అనంతరం చేప ముక్కల్లో నిమ్మరసం, ఉప్పు,పసుపు వేసి.. కొంచెం సేపు పక్కకు పెట్టాలి.. తర్వాత కార్న్ ప్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర,గరం మసాలా, కొత్తిమీర, కర్వేపాకు వేసి చేపల ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ చేపల ముక్కలను ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అలా చేపలను అరగంట సేపు చేపల ముక్కలను ఫ్రిజ్ లో పెట్టుకున్న తర్వాత.. తీసుకుని బయట పెట్టుకోవాలి. అనంతరం గ్యాస్ స్టౌ వెలిగించి.. లోతులేని అడుగు మందంగా ఉండే కళాయిని పెట్టుకుని.. నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత చేప ముక్కలను వేసి.. చిన్న మంటమీద రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా చేప ముక్కలు ఎర్రగా అయ్యే వరకూ వేయించుకుని ఒక ప్లేట్ తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ.. గార్నిష్ కోసం క్వాలిసిన వారు జీడిపప్పు వేయించుకుని పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'