AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: ఫాదర్స్‌ డే రోజు తన కొడుకును పరిచయం చేసిన యువరాజ్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..

యువీ తన కుమారుడి ఫోటోలు షేర్ చేయగానే అవి తెగ వైరలయ్యాయ్. యువీ దంపతులకు ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కొందరు ఫ్యాన్స్ భవిష్యత్తు యువరాజ్ అంటూ కామెంట్లు చేశారు. "ఇది అసాధారణమైనది.

Yuvraj Singh: ఫాదర్స్‌ డే రోజు తన కొడుకును పరిచయం చేసిన యువరాజ్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..
Yuvraj Singh
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 20, 2022 | 4:33 PM

Share

Yuvraj Singh: భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ ప్రశాంతమైన రిటైర్డ్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అతను తన భార్య హేజెల్ కీచ్‌తో తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల యువరాజ్ సింగ్ ఒక మగబిడ్డకు తండ్రి అయ్యాడు. ఇదిలా ఉంటే, ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగాఈ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త అందించాడు. యువీ తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ అతనికి పెట్టిన పేరును కూడా అభిమానులతో పంచుకున్నాడు. యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యువరాజ్ భార్య హాజెల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తమకు కొడుకు పుట్టినట్టు జనవరి 25న యువరాజ్ సింగ్ దంపతులు ప్రకటించారు.

కాగా తాజాగా తమ కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా యువరాజ్ సింగ్ ప్రకటించారు. తమ కుమారుడికి ‘ఓరియన్ కీచ్ సింగ్’ అని పేరు పెట్టినట్టు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఓరియన్ కీచ్ సింగ్ కు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ఓరియన్ అంటే ఒక నక్షత్ర రాశిఅని.. తన భార్య ప్రసవించే సమయంలో తనకు ఈ పేరు తట్టినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇక, యువీ తన కుమారుడి ఫోటోలు షేర్ చేయగానే అవి తెగ వైరలయ్యాయ్. యువీ దంపతులకు ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కొందరు ఫ్యాన్స్ భవిష్యత్తు యువరాజ్ అంటూ కామెంట్లు చేశారు. “ఇది అసాధారణమైనది. ‘ఒక రోజు, మీరు తండ్రి అయినప్పుడు, మీ తల్లిదండ్రులకు మీ పట్ల ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకుంటారు’ అని నా తల్లిదండ్రులు ఎప్పుడూ నాతో చెప్పేవారు. ఇప్పుడు నేను ఓ బిడ్డకు తండ్రి అయిన తర్వాత తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు అర్ధమయ్యాయని అన్నారు.

ఓ పిల్లాడికి తండ్రి బాధ్యత మాటల్లో వర్ణించలేనంత ప్రత్యేకమైన, అద్భుతమైన అనుభూతి. మా బాబు భూమి మీదకు వచ్చినప్పుడు నేను పొంగిపోయాను. ఇది మా మొదటి సారి. నాకు ఏం చెప్పాలో, ఏం చేయాలో తోచలేదు. మా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని యువరాజ్ తాను మొదటిసారి గా తండ్రి అనుభూతిని పొందిన విధానం పేర్కొన్నారు.  2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత లెఫ్ట్ హ్యాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్, 2012లో క్యాన్సర్ బారిన పడి, దాని నుంచి కోలుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..