Roshan Mahanama: మానవత్వం చాటుకున్న మాజీ క్రికెటర్.. పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టిన జనం.. ఛాయ్‌, బన్‌లు సప్లై

శ్రీలంకలో పెట్రోల్‌ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా పెట్రోల్‌ బంక్‌ల వద్ద పడిగాపులు పడుతున్న ప్రజలకు టీలు, స్నాక్స్‌ సర్వ్‌ చేశారు.

Roshan Mahanama: మానవత్వం చాటుకున్న మాజీ క్రికెటర్.. పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టిన జనం.. ఛాయ్‌, బన్‌లు సప్లై
Roshan Mahanama
Follow us
Surya Kala

|

Updated on: Jun 20, 2022 | 2:59 PM

Roshan Mahanama: శ్రీలంకలో(Srilanka)  తీవ్ర ఆర్ధిక సంక్షోభం(Economic crisis) ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగాయి. తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడేందుకు కొత్త ప్రభ్తుం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో వస్తుల దిగుమతి కష్టంగా మారింది. ఇంధన సంక్షోభం సైతం తలెత్తడంతో.. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

ఇదిలా ఉంటే.. శ్రీలంకలో పెట్రోల్‌ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా పెట్రోల్‌ బంక్‌ల వద్ద పడిగాపులు పడుతున్న ప్రజలకు టీలు, స్నాక్స్‌ సర్వ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన “క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, పైగా అంతసేపు నుల్చుని ఉండటం వల్ల ఆకలిగానూ ఉండొచ్చు…అందుకే వారికి సాయం చేయాలనిపించి ఇలా చేశానని ఆయన తెలిపారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ తమకు అవసరం అనిపించకపోయినా బయటకు వెళ్లినప్పుడు ఆహార పదార్థాలు వెంట తీసుకెళ్లడం మంచిదని సూచించారు.

ఆకలితో ఉన్న మరొకరికి అది ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరికైన ఆరోగ్యం బాగోకపోతే అత్యవసర నెంబర్‌ 1990కి కాల్‌ చేయమని సూచించారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉండలాని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా తాను ప్రజలకు సర్వ్‌ చేసిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..