International Yoga Day 2022: నేడు ప్రపంచ యోగా దినోత్సవం.. దీనిని ఎందుకు జరుపుకొంటారు.. ప్రత్యేకత ఏమిటి..?

International Yoga Day 2022: జూన్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవము’ నిర్వహిస్తున్నారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి..

International Yoga Day 2022: నేడు ప్రపంచ యోగా దినోత్సవం.. దీనిని ఎందుకు జరుపుకొంటారు.. ప్రత్యేకత ఏమిటి..?
International Yoga Day 2022
Follow us

|

Updated on: Jun 21, 2022 | 7:06 AM

International Yoga Day 2022: జూన్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవము’ నిర్వహిస్తున్నారు.. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరిపేందుకు ప్రతిపాదన చేయడం, ఈ తీర్మానానికి 193 ఐరాస(ఐక్య రాజ్య సమితి) ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇవ్వడం తెలిసిందే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు సహ ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించారు.

దీంతో 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోదీ సూచించారు.

‘యుజ్’ అనగా ‘కలయిక’ అనే సంస్కృత ధాతువు నుండి ‘యోగ’ లేదా ‘యోగము’ అనే పదం ఉత్పన్నమైంది. ‘యుజ్యతేఏతదితి యోగః’, ‘యుజ్యతే అనేన ఇతి యోగః’ వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు వెళ్లడమే యోగ. ‘యోగము’ అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. యోగా అనేది ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

యోగతో ఎముకలు దృఢంగా..

వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే క్యాల్షియం కూడా తరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకె అవకాశం ఉంది. యోగాలో కొన్ని ఆసనాలు చేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతారు. యోగా అనేది ఓ దివ్యౌషధం అని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది. చక్కని విశ్రాంతి పొందుతారు. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. యోగా వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారికి యోగా అధ్భుత ఔషధమని చెప్పొచ్చు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?