Yoga and Meditation: యోగా-ధ్యానం మధ్య వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా.? రెండు ఒకదానికొకటి భిన్నంగా..

Yoga and Meditation: యోగా - ధ్యానం అంటే ఒకటేనా.. కాదా..? అనే విషయంపై చాలా మందికి అనుమానం ఉంటుంది. యోగా, ధ్యానం మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ..

Yoga and Meditation: యోగా-ధ్యానం మధ్య వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా.? రెండు ఒకదానికొకటి భిన్నంగా..
Follow us
Subhash Goud

|

Updated on: Jun 19, 2022 | 9:39 PM

Yoga and Meditation: యోగా – ధ్యానం అంటే ఒకటేనా.. కాదా..? అనే విషయంపై చాలా మందికి అనుమానం ఉంటుంది. యోగా, ధ్యానం మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, రెండు కూడా ఒకటే అని వారు భావిస్తుంటారు. యోగా ఇన్స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రెండింటికీ శ్వాసతో సంబంధం ఉంది. కానీ వాటి ప్రయోజనాలు, వాటి పద్దతులు భిన్నంగా ఉంటాయి. యోగా, ధ్యానం మధ్య తేడా తెలుసుకోండి

  1. యోగాలోనే ధ్యానం ఒక భాగం. యోగా, ధ్యానం మధ్య అతిపెద్ద వ్యత్యాసం శరీరం కదలిక. యోగా సమయంలో వివిధ భంగిమల కారణంగా శరీరంలో కదలిక ఉంటుంది. అయితే ధ్యానంలో ఇది జరగదు. ధ్యానం చేయడం ద్వారా మానవులు తమ శక్తి ద్వారా ఒక నిర్దిష్టమైన ధ్వని లేదా శ్వాసపై దృష్టి పెడతారు.
  2. యోగా చేసిన తర్వాత ధ్యానం చేయడం ఎల్లప్పుడూ మంచిది. యోగా తర్వాత శరీరంలో ఓ రకమైన వైబ్రేషన్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ధ్యానం చేయడం మంచిది. ఈ విధంగా ధ్యానం అనేది యోగా తర్వాత సాధన.
  3. ఇప్పుడు మనం ధ్యానం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఒక వ్యక్తి మనస్సు అనేక విధాలుగా ఆలోచిస్తుంది. దాని కారణంగా అతని మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఆ శాంతిని తిరిగి పొందాలంటే ధ్యానం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఉదయం 4-5 గంటలు ధ్యానం చేయడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది.
  4. ధ్యానం అనేక విధాలుగా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మరచిపోయే అలవాటును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది చాలా వరకు నిద్రలేమి సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి