Liver Problem: ఢిల్లీ వైద్యుల ఘనత.. ఐదేళ్లుగా లివర్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆ రోగికి ఏం చేశారంటే..

Liver Problem: ఉజ్బెకిస్థాన్‌కు చెందిన బఖ్రాన్ అఖ్రోవ్ అనే రోగి గత 15 సంవత్సరాలుగా హెపటైటిస్ బి, 5 సంవత్సరాలుగా కాలేయ వైఫల్యంతో బాధపడుతున్నాడు. రోగికి చెందిన..

Liver Problem: ఢిల్లీ వైద్యుల ఘనత.. ఐదేళ్లుగా లివర్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆ రోగికి ఏం చేశారంటే..
Liver Problem
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2022 | 9:26 PM

Liver Problem: ఉజ్బెకిస్థాన్‌కు చెందిన బఖ్రాన్ అఖ్రోవ్ అనే రోగి గత 15 సంవత్సరాలుగా హెపటైటిస్ బి, 5 సంవత్సరాలుగా కాలేయ వైఫల్యంతో బాధపడుతున్నాడు. రోగికి చెందిన బ్లడ్‌ గ్రూప్‌ చాలా అరుదు. తన దేశమైన ఉజ్బెకిస్థాన్‌లో తన అనారోగ్యానికి పరిష్కారం కనుగొనకపోవడంతో, అతను తన సోదరుడితో కలిసి భారతదేశానికి వచ్చాడు. చాలా చోట్ల వైద్యం చేయించుకున్నా సమస్య తగ్గడం లేదు. పరిస్థితి విషమించడంతో రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ అతని సోదరుడు తన కాలేయాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దాదాపు 10 గంటల పాటు సాగిన శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు కాలేయాన్ని అమర్చి రోగి ప్రాణాలను కాపాడారు.

ఈ కేసు గురించి ఢిల్లీలోని ఆకాశ్ హెల్త్‌కేర్ హాస్పిటల్‌లోని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అజితాబ్ శ్రీవాస్తవ వివరిస్తూ, “రోగి మరణం అంచున ఉన్నాడు. రోగికి తీవ్రమైన కామెర్లు, సిర్రోసిస్ (కాలేయం వైఫల్యం), నీటి కడుపు, రక్తంలో వాపు, వాంతులు వంటి సమస్యలు ఉన్నాయి. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్త కాలేయాన్ని రోగి శరీరం బాగా స్వీకరించింది. శస్త్రచికిత్స తర్వాత రోగులను సాధారణంగా వెంటిలేటర్లపై ఉంచుతారు. కానీ బఖ్రాన్ విషయంలో ఇది అస్సలు అవసరం లేదు. ప్రక్రియ తర్వాత అతను పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నాడు. అతని కాలేయం మూడు నెలల్లో సాధారణ పరిమాణానికి తిరిగి వస్తుంది. అలాగే అతను తన రోజువారీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు అని వివరించారు.

కాలేయం ఎవరు దానం చేయవచ్చు..

ఇవి కూడా చదవండి

18 నుంచి 55 ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా కాలేయాన్ని దానం చేయవచ్చని ఆసుపత్రికి చెందిన హెపాటో-ప్యాంక్రియాటో-బిలియరీ సర్జరీకి చెందిన డాక్టర్ ఆశిష్ జార్జ్ తెలిపారు. కాలేయాన్ని దానం చేసే రోగులను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఇది కొన్ని రోజుల్లో దానంతటదే పెరుగుతుంది. అందుకే ఈ ప్రక్రియలో కాలేయాన్ని దానం చేయడం, మీ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు.

తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల కాలేయ వ్యాధులు వస్తాయని వైద్యులు తెలిపారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో మైదా, ఉప్పు తక్కువగా వాడాలి. మద్యం అలవాటు ఉన్నవాళ్లు మానుకుంటే ఎంతో మంచిది. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి. ఆహారంలో వేయించిన వాటిని తీసుకోవద్దని పేర్కొన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే