AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA: అగ్రరాజ్యాన్ని వదలని ఆర్థిక కష్టాలు.. 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం..

USA: అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ పరిస్థితుల్లో ఫెడరల్‌ బ్యాంక్‌కు వడ్డీ రేటు పెంచక తప్పలేదు. ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 1.75 శాతానికి పెరిగాయి. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల కావడం...

USA: అగ్రరాజ్యాన్ని వదలని ఆర్థిక కష్టాలు.. 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం..
Venkata Chari
|

Updated on: Jun 16, 2022 | 9:43 PM

Share

USA: అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ పరిస్థితుల్లో ఫెడరల్‌ బ్యాంక్‌కు వడ్డీ రేటు పెంచక తప్పలేదు. ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 1.75 శాతానికి పెరిగాయి. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల కావడం గమనార్హం. దీంతో హౌసింగ్‌, వెహికిల్‌, ఇతర రుణాల విషయంలో అమెరికా ప్రజలపై భారం పడుతుంది. వడ్డీ రేటును ఇంత ఎక్కువగా పెంచడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

అమెరికా వృద్ధి రేటును మార్చిలో 2.8 శాతంగా అంచనా వేయగా దాన్ని 1.7 శాతానికి తగ్గించారు. నిరుద్యోగిత కూడా పెరగనుంది. ఈ సంవత్సరం నిరుద్యోగిత 4.1 శాతానికి చేరుకోవచ్చని, 2024 చివరి నాటికి 3.6 శాతానికి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్లూప్రింట్‌ను చూస్తే వచ్చే ఏడాది మార్చిలో వడ్డీ రేటు దాని అంచనా కంటే చాలా ఎక్కువకు చేరుతుందని తెలుస్తోంది.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి వడ్డీ రేటు 1.9 శాతానికి చేరుకోవచ్చని, 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2.8 శాతానికి చేరుతుందని ఫెడ్ రిజర్వ్ మార్చిలో పేర్కొంది. తాజా అంచనాల ప్రకారం డిసెంబర్ నాటికి వడ్డీ రేటు 3.4 శాతానికి, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3.8 శాతానికి చేరుతుందని అంచనా. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆహారం, ఇంధనం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ పరిస్థితి అమెరికా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. గ్యాసోలిన్‌ ధరలు పెరిగిపోతూ రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలకు క్లిక్ చేయండి..