Afghanistan Journalist: నాడు ప్రముఖ న్యూస్ రీడర్, నేడు వీధి వ్యాపారి.. జర్నలిస్ట్ జీవితాన్ని మార్చేసి రాకాసి పాలన..!

Afghanistan Journalist: అప్పుడతను ప్రముఖ జర్నలిస్ట్‌.. కానీ ఇప్పుడు ఓ వీధి వ్యాపారి.. ఒక్కసారిగా అతని పరిస్థితి మారిపోయింది.

Afghanistan Journalist: నాడు ప్రముఖ న్యూస్ రీడర్, నేడు వీధి వ్యాపారి.. జర్నలిస్ట్ జీవితాన్ని మార్చేసి రాకాసి పాలన..!
Afghanistan Tv Anchor
Follow us

|

Updated on: Jun 17, 2022 | 5:45 AM

Afghanistan Journalist: అప్పుడతను ప్రముఖ జర్నలిస్ట్‌.. కానీ ఇప్పుడు ఓ వీధి వ్యాపారి.. ఒక్కసారిగా అతని పరిస్థితి మారిపోయింది. కారణం అక్కడి దుర్మార్గపు పాలన. అవును, ఆఫ్గనిస్తాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి అనడానికి ఇదే ఉదాహరణ. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడి అరాచక పాలనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశంమయ్యాక అక్కడ దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. మరోవైపు మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఓ జర్నలిస్ట్‌ వీధి వ్యాపారిగా మారిపోయిన ఘటన అఫ్గనిస్తాన్‌ దుర్భర పరిస్థితిని తెలియజేస్తోంది. ముసా మొహమ్మది అనే అఫ్గాన్‌ టీవీ యాంకర్‌ కాబూల్‌ వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. దీన్ని అఫ్గనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వంలో పనిచేసిన కబీర్‌ హక్మల్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇప్పటి తాలిబన్ల అరాచక, అసమర్థ పాలనను తెలియజేస్తోంది. ఒక జర్నలిస్ట్‌ ఇంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడంటే, ఆ దేశంలోని మిగతా సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఘటన అద్ధం పడుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే జర్నలిస్ట్‌ ముసా మొహమ్మది ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అక్కడి నేషనల్‌ రేడియో, టెలివిజన్‌ డైరెక్టర్‌ స్పందించారు. మాజీ టీవీ జర్నలిస్ట్‌ ముసా మొహమ్మదికి తమ దగ్గర ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఇక ఫొటో వైరల్‌గా మారడంతో ఆ మాజీ టీవీ జర్నలిస్ట్‌కు ఉపాధి లభించనుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అఫ్గనిస్తాన్‌లో ఉపాధి కరువై దుర్భర జీవితాలను అనుభవిస్తున్న మిగతా వారి పరిస్థితి ఏంటి? వారి జీవితాలను ఓ వెలుగులోకి తీసుకొస్తారు? తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గనిస్తాన్‌ను ఎవరు ఆదుకుంటారు? కడు పేదరికంలో ఉన్న దేశాన్ని ఎవరు బయట పడేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.