Over Thinking: అతిగా ఆలోచించడం ఎలా ఆపాలి? ఈ మైండ్ ట్రిక్‌తో తక్షణమే ‘ఓవర్ థింకింగ్‌’కు చెక్ పెట్టండి..!

మీరు తరచుగా అతిగా ఆలోచిస్తున్నారా? ఈ మైండ్ ట్రిక్ మీ ఆలోచనలను పాజ్ చేస్తుంది. కొన్ని సెకన్ల వ్యవధిలో మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది.

Over Thinking: అతిగా ఆలోచించడం ఎలా ఆపాలి? ఈ మైండ్ ట్రిక్‌తో తక్షణమే ‘ఓవర్ థింకింగ్‌’కు చెక్ పెట్టండి..!
Over Thinking
Follow us

|

Updated on: May 24, 2022 | 3:03 PM

Over Thinking: చాలా మంది ఓవర్ థింకింగ్ సమస్యతో సతమతం అవుతుంటారు. రేసు గుర్రం మాదిరిగా వచ్చే ఆలోచనలు మన మెదళ్లను తొలచివేస్తుంటాయి. అడ్డూ, అదుపు లేని ఆలోచనతో సతమతం అవుతుంటారు. చాలా మంది ఈ ఓవర్ థింకింగ్ కారణంగా తమ జీవితాలను నాశనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొందరు పిచ్చోళ్లుగా మారితే.. మరికొందరు సైకోలుగా మారిపోయారు. తమ బంగారం లాంటి భవిష్యత్‌ను ఈ ఓవర్ థింకింగ్ కారణంగా సర్వనాశనం చేసుకున్నారు.. చేసుకుంటున్నారు. అయితే, ఈ ఓవర్ థింకింగ్ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ప్రముఖ యోగా ట్రైనర్ ఎకార్ట్ టోల్లే. అవును.. మీ బ్రెయిన్‌ను, మీ థింకింగ్స్‌ను మీరే కంట్రోల్ చేసుకోవడానికి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారాయన. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మీ ఆలోచనలను పాజ్ చేసి, మీ మనస్సును నిర్మలంగా చేసే ఒక ఉపయాన్ని ఆయన సూచించారు.

టిక్‌టాక్ పేజీ ది మెంటల్ లెవెల్ ‘జెడి మైండ్ ట్రిక్’ పేరుతో వీడియో షేర్ చేశారాయ. ఆ ట్రిక్ ద్వారా ప్రజలు చాలా త్వరగా తమ మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోగలరని చెబుతున్నారు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జెడి మైండ్ ట్రిక్ ప్రకారం.. ‘‘మీ మనస్సును పూర్తి స్తబ్ధుగా ఉంచండి. అంటే.. కళ్లు మూసుకుని, మొత్తం గట్టిగా గాలి పీల్చుకుని, మనసంగా నిర్మానుష్యంగా ఉండా ఉండేలా చేసుకుని కాసేపు పాజ్ చేసి ఉంచాలి. కేవలం చీకటిని మాత్రమే దర్శించాలి. ఆ తరువాత శ్వాసనువ దిలి.. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నా తరువాతి ఆలోచన ఏంటి? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏదైనా వచ్చినట్లయితే.. దానిని వెంటనే గుర్తించి, క్షణాల వ్యవధిలోనే ఆ ప్రశ్నను కూడా వదిలేయాలి. ఆ తరువాత మెల్లగా లోతైన శ్వాస తీసుకోవాలి. కండరాలను రిలాక్స్ చేయండి. అలా రిలాక్స్ అయిన తరువాత.. మీ తదుపరి ఆలోచన ఏంటనేది మరోసారి ప్రశ్నించుకోండి.’’ అలా దీని ప్రభావాన్ని అనుభూతి చెందే వరకు ఒక లయ ప్రకారం ప్రాక్టీస్ చేయండి. మీ మనస్సు స్తబ్దుగా ఉండటం, పూర్తి ప్రశాంతంగా ఉండటాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఇలా రోజ చేయడం వలన.. మీ మనస్సును, మీ ఆలోచనను మీ నియంత్రణలో ఉంచుకునే శక్తిని మీరు పొందుతారు అని ఎకార్ట్ పేర్కొన్నారు. కాగా, జెడి మైండ్ ట్రిక్‌ పట్ల చాలామంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ ట్రిక్ అద్భుతంగా పని చేస్తుందని తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో టిక్‌టాక్‌లో షేర్ చేయడం వల్ల.. ఇక్కడ పబ్లిష్ చేయలేకపోతున్నాం.