Viral Video: గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన నవవధువు.. సీన్ కట్ చేస్తే పోలీసుల ట్విస్ట్..!

Viral Video: అత్తారింట్లోకి అడుగు పెడుతూనే ఆ నవవధువు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. అయితే సెలబ్రిటీ ఫైరింగ్‌ ఆమె కొంపముంచింది.

Viral Video: గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన నవవధువు.. సీన్ కట్ చేస్తే పోలీసుల ట్విస్ట్..!
Birde Gun Fire
Follow us
Shiva Prajapati

|

Updated on: May 22, 2022 | 9:48 AM

Viral Video: అత్తారింట్లోకి అడుగు పెడుతూనే ఆ నవవధువు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. అయితే సెలబ్రిటీ ఫైరింగ్‌ ఆమె కొంపముంచింది. కేసు నమోదయ్యింది. సంచలనం రేపిన ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. కాగా, వధువు ఫైరింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొత్త జంట .. ఎన్నో ఆశలతో ఆ నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. కాని కాపురం మొదటి రోజే ఆమెపై కేసు నమోదయ్యింది. ఎందుకో తెలుసా ? భర్త చేసిన నిర్వాకం అందుకు కారణం. అత్తారింట్లోకి అడుగుపెట్టే ముందు ఆమె గన్‌తో గాల్లో కాల్పులు జరిపింది. సెలబ్రిటీ ఫైరింగ్‌ అన్నమాట . ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రాలో సంచలనం రేపింది ఈ ఘటన. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు భర్త ఆమె చేతికి ఒక తుపాకీ ఇచ్చాడు. దానితో గాల్లోకి కాల్పులు జరిపేందుకు సహకరించాడు. తుపాకీ పేలిన శబ్ధానికి వధువు పక్కనే ఉన్న ఆమె తల్లి భయాందోళన చెందింది. తరువాత వరుడు ఆ తుపాకీని మరో వ్యక్తికి అందజేశాడు.

బంధువులు, స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఓ జర్నలిస్ట్‌ ఈ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. యూపీ పోలీసులు, ఉన్నతాధికారులకు దీనిని ట్యాగ్‌ చేశారు. దీంతో ఆగ్రా పోలీసులు ఈ వీడియోపై స్పందించారు. దీనిపై దర్యాప్తు జరుపాలని ఖండౌలీ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సెలబ్రిటీ ఫైరింగ్‌లో పలువురి ప్రాణాలు పోతునప్పటికి జనాలకు బుద్దిరావడం లేదు. పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫీట్లు చేస్తున్నారు. పెళ్లి వేడుకల్లో వరుడు సెలబ్రిటీ ఫైరింగ్‌ చేసిన సందర్బాలు ఉన్నాయి. కాని వధువు కూడా గన్‌తో పేల్చడం సంచలనం రేపుతోంది.