Weight Loss: పిల్లలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? నియంత్రించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు

Weight Loss: ఇప్పుడున్న రోజుల్లో ఆహారపు అలవాట్ల వల్ల పెద్దల్లోనే కాకుండా పిల్లల్లోనూ తీవ్ర ప్రభావం ఉంటుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే వివిధ..

Weight Loss: పిల్లలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? నియంత్రించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2022 | 6:12 PM

Weight Loss: ఇప్పుడున్న రోజుల్లో ఆహారపు అలవాట్ల వల్ల పెద్దల్లోనే కాకుండా పిల్లల్లోనూ తీవ్ర ప్రభావం ఉంటుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పిల్లల్లో సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే ఎంతో మంచిది. మారుతున్న జీవనశైలి కారణంగా పిల్లల్లో ఆహారపు అలవాట్లను మార్పు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై కూడా కనిపిస్తోంది. పిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించడానికి ఈ ఆయుర్వేద నివారణలను అనుసరించండి.

  1. పండ్లు: పిల్లల బరువు తగ్గాలంటే రోజూ పరుగెత్తేలా చేయండి. దీని తరువాత ఆహారంలో అరటి లేదా పైనాపిల్ ఇవ్వడానికి బదులుగా, కివీ లేదా ఆపిల్ వంటి ఇతర పండ్లను ఇవ్వండి. ఇవి ప్రొటీన్‌కు ఉత్తమ మూలం. అలాగే పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.
  2. అవకాడో: ఇందులో ఉండే ఒలిక్ యాసిడ్ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ పండు పిల్లలకు తినడానికి ఇవ్వండి. తద్వారా అతను ఎక్కువసేపు ఆకలితో ఉండడు. అవోకాడో కూడా ప్రోటీన్ అధికంగా ఉండే పండు, ఇది ఆరోగ్యానికి చాలా విధాలుగా మంచిదని భావిస్తారు.
  3. ఆకు కూరలు: పిల్లల బరువును తగ్గించే ప్రక్రియలో ఎటువంటి పోషకాహార లోపాన్ని ఎదుర్కోకూడదని గుర్తుంచుకోండి. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఆకు కూరలు తినిపించండి. ఆయుర్వేదంలో కూరగాయలు తినడం వల్ల శరీరం లోపల నుండి దృఢంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
  4. నీరు తాగండి: అల్లోపతి మాత్రమే కాదు.. బరువు తగ్గడానికి కూడా నీరు ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. నిజానికి సరైన మోతాదులో నీరు తాగితే కడుపు నిండుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీకు ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. బరువు పెరగరు.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.