Subhash Goud |
Updated on: Jun 16, 2022 | 3:23 PM
Health Tips: సమయాభావం కారణంగా ప్రజలు అనేక చెడు అలవాట్లను అలవర్చుకుంటారు. చాలా మంది నిలబడి తింటుంటారు. ఇలా తినడం ఒక రకమైన ట్రెండ్‌గా మారింది. అయితే నేలపై కూర్చొని తినడం చాలా మంచిది. ఈ పద్ధతి సమయాన్ని ఆదా చేస్తుంది.
ఊబకాయం: మనం నేలపై హాయిగా కూర్చొని ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారం తీసుకున్నట్లు మెదడుకు సందేశం వెళ్తుందని పరిశోధనలో వెల్లడైంది. నివేదికల ప్రకారం, నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
విపరీతమైన ఆకలి: నిలబడి ఆహారం తినే అలవాటు ఉన్నవారికి తరచుగా ఎక్కువ ఆకలితో ఉంటారు. ఇతర వ్యాధులు దరి చేరుతాయి. జీర్ణవ్యవస్థ: నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను చాలా వరకు ప్రభావితం చేస్తుంది. నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం పేగుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
ఉబ్బరం: సమయాన్ని ఆదా చేసుకునేందుకు కొందరు నిలబడి ఆహారం తీసుకుంటారు. ఈ సమయంలో వారు ఆహారాన్ని కూడా సరిగ్గా నమలలేరు. మీ ఈ పద్ధతి వల్ల కడుపు సమస్యలు వస్తాయి.