- Telugu News Photo Gallery Child obesity problem solve by following these weight loss ayurvedic tips in Telugu
Weight Loss: పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారా..? చెక్ పెట్టాలంటే ఇలా చేయండి..
Child obesity problem: ఆహారపు అలవాట్ల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. చెడు ఆహారం కారణంగా పిల్లలు స్థూలకాయం నుంచి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించడానికి ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Jun 16, 2022 | 9:25 PM

ఆహారపు అలవాట్ల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. చెడు ఆహారం కారణంగా పిల్లలు స్థూలకాయం నుంచి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించడానికి ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పండ్లు: పిల్లల బరువు తగ్గాలంటే రోజూ ఆహారంలో పలు మార్పులు చేయండి. ఆహారంలో అరటి లేదా పైనాపిల్ ఇవ్వడానికి బదులుగా.. కివీ లేదా ఆపిల్ వంటి ఇతర పండ్లను ఇవ్వండి. ఇవి ప్రొటీన్‌కు ఉత్తమ మూలం. దీంతోపాటు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.

అవకాడో: ఇందులో ఉండే ఒలిక్ యాసిడ్ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ పండు పిల్లలకు తినడానికి ఇవ్వండి. తద్వారా అతనికి ఎక్కువసేపు ఆకలి వేయదు. అవోకాడోలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తినడం ఆరోగ్యానికి మంచిది.

ఆకు కూరలు: పిల్లల బరువు తగ్గించే ప్రక్రియలో.. ఎటువంటి పోషకాహార లోపాన్ని ఎదుర్కోకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటువంటి పరిస్థితిలో అతనికి ప్రతిరోజూ ఆకు కూరలు తినిపించండి. ఆయుర్వేదంలో కూరగాయలు తినడం వల్ల శరీరం లోపల నుంచి బలంగా తయారవుతుందని వివరించారు.

నీరు తాగాలి: అల్లోపతి మాత్రమే కాదు బరువు తగ్గడానికి నీరు ఉపయోగపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్పారు. వాస్తవానికి సరైన మోతాదులో నీరు తాగితే కడుపు నిండుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు తక్కువ ఆకలిని కలిగించి బరువు పెరగకుండా చేస్తుంది.





























