- Telugu News Entertainment Tollywood Anupama Parameshwaran scolds people saying shame on you to people who throw trash on the street
Anupama Parameswaran: అందాల అనుపమకు కోపం వచ్చింది.. కారణం ఏంటంటే
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. సంప్రదాయబద్దంగా కనిపిస్తూ.. అందం, అభినయంతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించికుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అనుపమకు ఇప్పుడు కోపం వచ్చింది..
Updated on: Jun 16, 2022 | 8:25 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. సంప్రదాయబద్దంగా కనిపిస్తూ.. అందం, అభినయంతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించికుంది ఈ ముద్దుగుమ్మ.

ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అనుపమకు ఇప్పుడు కోపం వచ్చింది.. షేమ్ ఆన్ యూ అంటూ తన ఇన్ స్టా ఖాతాలో అసహనం వ్యక్తం చేసింది అనుపమ.

రోడ్లపై చెత్త ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సీరియస్ అయ్యింది అనుపమ్.. ఆమె షేర్ చేసిన ఫోటోలలో చెత్త దగ్గరే ఆవులు నిల్చుని తింటూ ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ” నా గుడ్ మార్నింగ్ రోజూ ఇలాగే మొదలవుతుంది.. ఇంకా ఈ భూమ్మీద ఇలాంటివి చూస్తూ ఈ ప్రకృతిని ఇలా చేస్తున్నవారిని చూస్తే నాకు సిగ్గుగా ఉంది.. సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్” అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో నిఖిల్ సరసన రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి 18 పేజెస్, రెండోది కార్తికేయ 2





























