AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefits: యోగాతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలా చేయండి మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోండి

Yoga Benefits: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ రక్తపోటు వల్ల పాదాలలో వాపు, దృష్టి లోపం, హృదయ సంబంధ సమస్యలు వస్తాయి. WHO..

Yoga Benefits: యోగాతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలా చేయండి మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోండి
Subhash Goud
|

Updated on: Jun 20, 2022 | 7:43 AM

Share

Yoga Benefits: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ రక్తపోటు వల్ల పాదాలలో వాపు, దృష్టి లోపం, హృదయ సంబంధ సమస్యలు వస్తాయి. WHO తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 200 మిలియన్లకు పైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలో సాధారణ రక్తపోటు స్థాయి 120/80mmHg. అయితే రక్తపోటు రీడింగ్ 90/60 mmHg కంటే తక్కువగా ఉంటే అది తక్కువగా పరిగణించబడుతుంది. పని ఒత్తిడి, అనియంత్రిత ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల కలిగే సమస్యలలో రక్తపోటు ఒకటి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని హైపర్ టెన్షన్ అంటారు. మీరు చాలా కాలంగా హైపర్‌టెన్సివ్ మెడిసిన్ తీసుకుంటూ, ఎటువంటి తేడా లేనట్లయితే, మీరు ఈ యోగాసాలను పాటించడం ద్వారా మీ అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.

తక్కువ రక్తపోటు నివారణకు యోగాసనం

మత్స్య యోగా మత్ససనా యోగ అభ్యాసం రక్తపోటును తగ్గిస్తుంది. ఈ స్థితిలో మీరు నేలపై పడుకుని, ఆపై మీ ఛాతీని నేలపైకి ఎత్తండి. మీ తల నేలపై, మీ చేతులను నేలపై నేరుగా ఉంచండి. అధిక వ్యాయామం, అధిక చెమట కొన్నిసార్లు రక్తపోటును తగ్గిస్తుంది. అదనంగా డీహైడ్రేషన్ వల్ల తక్కువ రక్తపోటు వస్తుంది. ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి

పద్మ సర్వంగాసనం ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇందులో నేలపై పడుకుని, ముందుగా కాళ్లను నిటారుగా ఉంచి, ఆపై మోకాళ్లను కొద్దిగా వంచి, చేతులను నేలపై నిటారుగా ఉంచాలి. పద్మ సర్వంగాసనం మెదడు, థైరాయిడ్ గ్రంధిలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అధిక రక్తపోటును తగ్గించడానికి యోగా

వజ్రాసనం మీ మోకాళ్లను వంచి, మీ పాదాలపై కూర్చోండి. ఆపై మీ చేతులను మీ మోకాళ్లపై ఉంచండి. ఈ ఆసనం మంచి రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ ఆసనాన్ని స్వీకరించడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఈ ఆసనంలో కాళ్ళను నిఠారుగా చేసి, మీ చేతులతో కాళ్ళను పట్టుకోండి. ఇలా 10 నిమిషాలు చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి