Jamun Health: గుండెను పదిలంగా ఉంచే ఆరోగ్య నేరేడు.. జామున్ జ్యూస్ బెనిఫిట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే..
జామూన్‌లో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జామున్‌లో విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ బి6, రైబోఫ్లావిన్, నియాసిన్ ఉన్నాయి.
Jamun Health Benefits: వేసవి చివర్లో దొరికే నేరేడు (జామున్) పండు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలామంది ఇష్టంతో తింటారు. ఈ జామున్ పండు నీలం, ఊదా రంగులో ఉంటుంది. జామూన్‌లో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జామున్‌లో విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ బి6, రైబోఫ్లావిన్, నియాసిన్ ఉన్నాయి. జామూన్ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండటానికి వేసవిలో జామున్ జ్యూస్‌ని తీసుకోవచ్చు. వేసవిలో నేరెడు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది: జామున్‌లో మినరల్స్, విటమిన్ సి, ఐరన్ ఉంటాయి. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడేవారికి జామున్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జామూన్‌లో ఆస్ట్రింజింగ్ గుణాలు: జామూన్‌లో ఆస్ట్రింజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమలను పోగొట్టడానికి పనిచేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి జామూన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా ఉంచడంలో, నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కళ్లకు మేలు చేస్తుంది: జామూన్‌లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: జామూన్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులను దూరంగా ఉంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
చిగుళ్ళు, దంతాలను బలపరుస్తుంది: నేరెడు చిగుళ్ళు, దంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది. జామున్ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. చిగుళ్లలో రక్తస్రావం ఆపడానికి వాటిని ఉపయోగించవచ్చు. దీని కోసం ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఉపయోగించాలి. ఇది చిగుళ్లలో రక్తస్రావం మరియు ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. నోటి పూతల చికిత్సకు కూడా ఇవి పనిచేస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జామూన్‌లో ఉన్నాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇది పనిచేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..