AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని ఆహారంలో చేర్చుకోండి చాలు..

విత్తనాలు వేగంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. దీనిలో భాగంగా ఆహారంలో అనేక రకాల విత్తనాలను చేర్చుకోవచ్చు.

Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని ఆహారంలో చేర్చుకోండి చాలు..
Weight Loss Tips
Shaik Madar Saheb
|

Updated on: Jun 18, 2022 | 9:50 PM

Share

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు (ఊబకాయం) తో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి మీరు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విత్తనాలు వేగంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. దీనిలో భాగంగా ఆహారంలో అనేక రకాల విత్తనాలను చేర్చుకోవచ్చు. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. మీరు వాటిని అనేక విధాలుగా తినవచ్చు. మీరు వాటిని సూప్‌లు, సలాడ్‌ల రూపంలో తీసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అవి మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజల్లో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. అవి జీవక్రియను మెరుగుపరచడానికి పని చేస్తాయి. ఈ విత్తనాలను అనేక విధాలుగా వేయించి లేదా నానబెట్టడం ద్వారా తినవచ్చు. ఈ విత్తనాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ విత్తనాలు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తాయి. వీటిల్లో ప్రొటీన్ ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ తర్వాత అవిసె గింజలను తినడం తరచుగా సిఫారసు చేస్తారు. ఇవి పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి.

చియా విత్తనాలు

చియా విత్తనాల్లో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ఇది మంచి ఆహారం. ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఇవి వేగంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటి రుచి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ పరిమాణంలో తినడం మంచిది. మీరు ప్రతిరోజూ రెండు టీస్పూన్ల చియా విత్తనాలను తినవచ్చు. మీరు దీన్ని అనేక విధాలుగా తినవచ్చు. సలాడ్‌లు, సూప్‌లలో కూడా తీసుకోవచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాలు

ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించే ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవడం ఉత్తమం. ఈ విత్తనాలను సలాడ్లు, జ్యూస్‌లలో తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు
సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు
గుడిలో దేవుడి దర్శనం అయ్యాక కాసేపు కూర్చోవాలంటారు.. ఎందుకో తెలుసా
గుడిలో దేవుడి దర్శనం అయ్యాక కాసేపు కూర్చోవాలంటారు.. ఎందుకో తెలుసా
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘మాస్‌ కాపీయింగ్‌'.. 47 మంది సస్పెండ్
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘మాస్‌ కాపీయింగ్‌'.. 47 మంది సస్పెండ్
ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర
ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
మహాశివరాత్రి నుంచి ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
మహాశివరాత్రి నుంచి ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే