Father’s Day: ప్రతి తండ్రి తప్పనిసరిగా 40 ఏళ్ల వయస్సులో ఈ వైద్య పరీక్ష చేయించుకోవాలి
Father’s Day: ఒక వయస్సులో ఆరోగ్య సమస్యలు మనందరినీ కొద్దిగా లేదా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలలో అధిక బీపీ, మధుమేహం, గుండె సమస్యలు, ఇతరాలు అనారోగ్య..
Father’s Day: ఒక వయస్సులో ఆరోగ్య సమస్యలు మనందరినీ కొద్దిగా లేదా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలలో అధిక బీపీ, మధుమేహం, గుండె సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ రోజుల్లో ఈ వ్యాధుల బారిన పడటం సర్వసాధారణమైపోయింది. పురుషులు కూడా ఒక వయస్సులో వచ్చిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన అన్ని చర్యలను తీసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. చాలా మంది పురుషులకు 40 ఏళ్ల వయస్సులో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వెనుక కారణాలు చాలా ఉండవచ్చు. కానీ పెరుగుతున్న వయస్సు కూడా సమస్యలు రావడానికి ఒక కారణమనే చెప్పాలి. అందుకే ప్రతి మనిషి 40 ఏళ్లకే హెల్త్ చెకప్ చేయించుకోవాలి. నేడు ఫాదర్స్ డే 2022. ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక దినాన్ని జూన్ మూడవ ఆదివారం జరుపుకుంటారు. తండ్రి నీడ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం. అయితే ఈ నీడను కూడా భద్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఇందు కోసం మీరు 40 ఏళ్లకు వచ్చిన తర్వాత కొన్ని వైద్య పరీక్షలను చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
షుగర్ వ్యాధి పరీక్షలు
ప్రస్తుతం మధుమేహంతో బాధపడటం సర్వసాధారణమైపోయింది. ఈ వ్యాధి వృద్ధులనే కాకుండా చిన్నపిల్లలకు కూడా సోకుతుంది. కుటుంబ చరిత్ర ఉన్న కారణంగా ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలకు సోకుతుంది. మీ తండ్రి తరచుగా ఒత్తిడికి గురవుతారు. అతని దినచర్య కూడా చెదిరిపోతుంది కాబట్టి అతని బ్లడ్ షుగర్ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోమని ఈ ఫాదర్స్ డే సందర్భంగా చెప్పండి. మధుమేహం వంటి వ్యాధిని గుర్తించడం చాలా ఆలస్యం. అందుకే మధ్యలో పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీ నాన్నగారికి మధుమేమం ఉన్నట్లయితే ఆహార నియమాలు సరిగ్గా పాటించాలని చెప్పండి.
అధిక బీపీ:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రజలు తరచుగా 40 ఏళ్ల తర్వాత రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటారు. ఒత్తిడి, ఆహారం, వృద్ధాప్యం దీనికి ముఖ్యమైన కారణాలు. హై బీపీతో ఎవరినైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అతను చాలా కాలం పాటు మందులు వేసుకోవడం ముఖ్యం. అధిక బీపీ కారణంగా గుండెపోటు, కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. ఇది నిశ్శబ్ద కిల్లర్ వ్యాధి. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
థైరాయిడ్:
ఒక వ్యక్తికి థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్య ఉంటే ఈ స్థితిలో అతని బరువు పెరుగుతుంది. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. థైరాయిడ్ శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇందుకోసం TSH అనే పరీక్ష ఉంది. 40 సంవత్సరాల వయస్సులో ప్రతి వ్యక్తి స్త్రీ లేదా పురుషుడు అనే తేడా లేకుండా తప్పనిసరిగా పరీక్షులు చేయించుకోవాల్సి ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఫాదర్స్ డే రోజున మీరు అతనిని ప్రత్యేకంగా భావించేలా చేయవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి