AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భూమిలో రైతుకు మెరుస్తూ కనిపించిన డబ్బా.. ఏముందా అని ఓపెన్ చెయ్యగా..

గుజరాత్‌లోని భారుచ్ జిల్లా సర్భాన్ గ్రామానికి చెందిన ముకేశ్‌ భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు.

Viral News: భూమిలో రైతుకు మెరుస్తూ కనిపించిన డబ్బా.. ఏముందా అని ఓపెన్ చెయ్యగా..
Viral News
Shaik Madar Saheb
|

Updated on: Jun 18, 2022 | 6:19 PM

Share

Viral News: ఓ రైతు పశువులను మేపేందుకు పొలాలకు వేళ్లాడు. ఈ క్రమంలో ఆ రైతుకు పొలంలో ఓ స్టీల్ డబ్బా కనిపించింది. ముందు అదేంటోనని పట్టించుకోని ఆ రైతు.. కొంత సమయం తర్వాత దాన్ని బయటకు తీశాడు. అనంతరం అనుమానంగా భయపడుతూ దాన్ని ఓపెన్ చేశాడు. అందులో కనిపించినవి చూసి రైతు షాకయ్యాడు. దానిలో డబ్బును చూసి షాకైన అతను.. గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీని గురించి నెట్టింట వైరల్‌ అవుతోంది. గుజరాత్‌లోని భారుచ్ జిల్లా సర్భాన్ గ్రామానికి చెందిన ముకేశ్‌ భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఓ స్టీల్ డబ్బా ఉండటాన్ని గుర్తించాడు. ముందు దాన్ని తేలికగా తీసుకున్న ఆయన.. ఆ తర్వాత భూమిలోంచి తీసి స్టీల్ బాక్సును ఓపెన్ చేశాడు. అందులో సుమారు రూ.22వేలు ఉండటంతో కంగుతిని.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. వెంటనే గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆ డబ్బు మున్నాభాయ్ అనే రైతువని తెలిసి మొత్తాన్ని ఆయనకు అప్పగించారు. దీంతో మున్నాభాయ్ సంతోషం వ్యక్తం చేశాడు.

కష్టపడి సంపాదించిన డబ్బు.. గతేడాది సంభవించిన వరదల వల్ల కొట్టుకుపోయిందని తెలిపాడు. దీంతో కొన్ని రోజులపాటు బాధపడి ఆ విషయాన్ని మర్చిపోయినట్టు చెప్పాడు.. అయితే సంవత్సరం తర్వాత డబ్బు తిరిగి తన వద్దకు చేరడంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో.. ఆ డబ్బులోంచి కొంత డబ్బును దేవుని హుండీలో వేసిన మున్నాభాయ్.. కొంత మొత్తాన్ని ముకేశ్‌భాయ్ ఇవ్వబోయాడు. ఆ డబ్బును ముకేశ్‌భాయ్ తిరస్కరించాడు.

Gujarat

Gujarat

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ముకేశ్‌భాయ్‌ని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..