Watch Video: ప్రతీకారం అంటే ఇదే.. మెరుపు ఫీల్డింగ్‌తో బ్యాట్స్‌మెన్‌పై కసి తీర్చుకున్న ప్లేయర్స్.. వైరల్ వీడియో..
T20 Blast: ఎసెక్స్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ పెప్పర్ క్వార్టర్-ఫైనల్స్‌లో లాంక్షైర్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఫిల్ సాల్ట్ అతనిని స్టంపౌట్ చేశాడు.
టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ ఇంగ్లండ్‌లో సందడి చేస్తోంది. ఇప్పటివరకు కొన్ని గొప్ప మ్యాచ్‌లు జరిగాయి. అలాగే వ్యక్తిగత స్థాయిలో బలమైన ప్రదర్శన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లోనూ ఈ ఉత్కంఠ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా లంకాషైర్ వర్సెస్ ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో అద్భుతం జరిగింది. ఇది చాలా చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో ఒక ఎసెక్స్ ఆటగాడు తన వికెట్‌కు లంకాషైర్ ఆటగాడిపై ప్రతీకారం తీర్చుకోగా, దానిని అతను అమలు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బౌండరీలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసే ఈ దృశ్యాన్ని అందరూ ఇష్టపడ్డారు. ఈ వీడియో నెట్టింట్లో ఎంతో వైరల్‌గా మారింది.
జులై 8 శుక్రవారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో, ఎసెక్స్ మొదట బ్యాటింగ్ చేసింది. జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మైఖేల్ పెప్పర్ వచ్చిన వెంటనే తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్ ఆధారంగా, ఎసెక్స్ మెరుగైన స్థితికి చేరుకుంది. ఆ తర్వాత 13వ ఓవర్ నాల్గవ బంతికి స్పిన్నర్ టామ్ హార్ట్లీపై భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దాన్ని పూర్తిగా మిస్ చేయడంతో వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ అతడిని చాలా వేగంగా స్టంపౌట్ చేశాడు. పెప్పర్ 28 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
IT’S HAPPENED ❗️
SALT STUMPS PEPPER ?#Blast22 pic.twitter.com/BWQP0T6BNB
— Vitality Blast (@VitalityBlast) July 8, 2022
ప్రస్తుతం క్రికెట్ ఆట పూర్తిగా మారింది. ఇక్కడ ప్రతి ఒక్కరికీ సెటిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. పేపర్‌కి కూడా అవకాశం వచ్చింది. లంకాషైర్‌కు ఓపెనింగ్ చేసిన ఫిల్ సాల్ట్ ఎసెక్స్ బౌలర్లపై పరుగుల వర్షం కురిపించాడు. అయితే అతను తొమ్మిదో ఓవర్‌లో షాట్ ఆడాడు.
WOW ?
What an effort from Michael Pepper ?@EssexCricket | #Blast22 pic.twitter.com/48Vztxycj5
— Vitality Blast (@VitalityBlast) July 8, 2022
బంతి 6 పరుగుల కోసం డీప్ మిడ్ వికెట్ బౌండరీ వైపు గాల్లోకి లేచింది. కానీ, అది ఫర్‌ఫెక్ట్ ముగింపు కాలేదు. అక్కడే ఉన్న మైఖేల్ పెప్పర్ గాలిలో దూకి బంతిని బౌండరీ దాటకుండా అడ్డుకున్నాడు. అతను బౌండరీ వెలుపల పడిపోయి, బంతిని బౌండరీ లోపలకు విసిరాడు. వేరే ఆటగాడు క్యాచ్ తీసుకొని సాల్ట్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.