Sai Pallavi: లవ్ లెటర్‌తో దొరికిపోయిన సాయి పల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు.. అసలు విషయం ఏంటంటే?

ఓ ప్రేమ లేఖ కారణంగా బాల్యంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, దీని వల్ల తన పేరెంట్స్ కొట్టారంటూ చెప్పుకొచ్చింది.

Sai Pallavi: లవ్ లెటర్‌తో దొరికిపోయిన సాయి పల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు.. అసలు విషయం ఏంటంటే?
Sai Pallavi (File Photo)
Follow us
Venkata Chari

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 11, 2022 | 12:05 AM

సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటీమణులలో ఒకరైన సాయి పల్లవి.. తన నిష్కళంకమైన శైలికి ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం వరుస సినిమాలతో సాయి పల్లవి ఎంతో బిజీగా ఉంది. తన తాజా సినిమా విరాట పర్వం ఓటీటీలో సందడి చేస్తోంది. ఎప్పుడూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే ఈ ఫిదా బ్యూటీ.. తాజాగా తన చిన్ననాడు జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని పంచుకుంది. ఓ ప్రేమ లేఖ కారణంగా బాల్యంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, దీని వల్ల తన పేరెంట్స్ కొట్టారంటూ చెప్పుకొచ్చింది.

చిన్నతనంలోనే ప్రేమలేఖలు..

ఇవి కూడా చదవండి

ఇటీవలే సాయి పల్లవి నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ చాట్ షో మై విలేజ్ షోలో పాల్గొంది. ఆమెతోపాటు విరాట్ పర్వం చిత్రంలో కథానాయకుడు రానా దగ్గుబాటి కూడా ఆ షోలో పాల్గొన్నాడు. షో యాంకర్ సాయి పల్లవిని కొన్ని గుర్తుండిపోయే చిన్ననాటి విషయాలను పంచుకొమ్మని కోరగా, దానికి సాయి పల్లవి చిన్నతనంలో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే, ఈ విషయంలో తన తల్లితండ్రులు తీవ్రంగా కొట్టారని చెప్పుకొచ్చింది. ఈమేరకు సాయి పల్లవి మాట్లాడుతూ- ‘‘నేను 7వ తరగతి చదువుతున్నాను. అప్పుడు ఒక అబ్బాయి నా స్కూల్ బ్యాగ్‌లో ప్రేమలేఖ పెట్టాడు. నేను అది గమనించలేదు. ఇంటికి వచ్చాక మా తల్లిదండ్రుల చేతుల్లోకి ఆ లేఖ చేరింది. ఆ తర్వాత నన్ను చాలా కొట్టారు’’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

నెట్‌ఫ్లిక్స్‌లో విరాట్ పర్వం..

సాయి పల్లవి, రానా దగ్గుబాటి నటించిన విరాట్ పర్వం సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో మేకర్స్ దీనిని OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 1న విడుదల చేశారు. ఈమేరకు సాయి పల్లవి తన సినిమా OTT ప్రమోషన్ కోసం నెట్‌ఫ్లిక్స్ చాట్ షోలో సందడి చేసింది.