వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమంత.. బాలీవుడ్‌లో మరో హీరోపక్కన హీరోయిన్ ఛాన్స్
స్టార్ హీరోయిన్ సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ సామ్ ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ నెటిజన్స్ తెగ ఆసక్తిగా చూస్తుంటారు.
స్టార్ హీరోయిన్ సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ సామ్ ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ నెటిజన్స్ తెగ ఆసక్తిగా చూస్తుంటారు. ఇక సినిమాల పరంగా టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో సమంత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాప్సీ స్వయంగా ప్రకటించారు. తాజాగా సామ్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం బీటౌన్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ అశ్వత్థామ’. ఈ సినిమాలో కథానాయికగా సమంత ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీకి సామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఇందులో ఆమె యాక్షన్ ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారి తెలుస్తోంది. అలాగే కరణ్ జోహర్ దర్శకత్వంలోనూ సామ్ నటించనున్నారని టాక్. ప్రస్తుతం తెలుగులో ఆమె ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ తళపతి సరసన మరోసారి నటించనున్నట్లు టాక్ నడుస్తోంది.
Also Watch:
మెగాస్టార్తో పోటీపడుతున్న లేడీ సూపర్ స్టార్ ??
ఆసుపత్రి నుంచి వచ్చాక విక్రమ్ రిలీజ్ చేసిన 1st వీడియో ఇదే !!
ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్ !! వైరల్ అవుతున్న లైవ్ యాక్సిడెంట్
సిగరెట్ తాగుతున్న శివుడు !! తమిళనాడులో కాక రేపిన బ్యానర్..
ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

