- Telugu News Photo Gallery Cricket photos These top 5 batsmans most runs in ind vs eng odi series full list here ms dhoni Sachin Tendulkar Virat Kohli
IND vs ENG ODI Series: నేటి నుంచే భారత్, ఇంగ్లండ్ వన్డేల సమరం.. అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్స్ వీరే..
IND vs ENG 1st ODI: ఇప్పటి వరకు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో ఓసారి పరిశీలిద్దాం.. ఈ లిస్టులో తొలి స్థానంలో
Updated on: Jul 12, 2022 | 10:50 AM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో ఓసారి పరిశీలిద్దాం.. ఈ లిస్టులో తొలి స్థానంలో ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌పై 48 వన్డేల్లో ధోనీ 1546 పరుగులు చేశాడు.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌పై 37 వన్డేల్లో యువరాజ్ 1523 పరుగులు చేశాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇక్కడ మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై 37 మ్యాచ్‌లు ఆడిన టెండూల్కర్ 1455 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో టాప్-4లో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్‌పై 33 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 1307 పరుగులు సాధించాడు.

మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఈ లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌పై 37 వన్డేలు ఆడన రైనా.. మొత్తం 1207 పరుగులు చేశాడు.




